PV sindhu quarter final: క్వార్టర్​ ఫైనల్స్​కు సింధు అర్హత

author img

By

Published : Nov 25, 2021, 2:57 PM IST

pv sindhu enters quarter finals, పీవీ సింధు క్వార్టర్​ ఫైనల్స్​

ఇండోనేషియా ఓపెన్​లో భారత స్టార్​ షట్లర్​ పీవీ సింధు(pv sindhu enters quarter finals) క్వార్టర్​ ఫైనల్స్​కు అర్హత సాధించింది. జర్మనీ ప్లేయర్​ వొన్ని లిపై(Yvonne Li) 21-12, 21-18 తేడాతో గెలుపొందింది.

pv Sindhu enters quarter finals: ఇండోనేషియా ఓపెన్​లో భాగంగా నేడు(గురువారం) జరిగిన పోరులో భారత స్టార్​ షట్లర్​ పీవీ సింధు క్వార్టర్​ ఫైనల్స్​కు చేరుకుంది. జర్మనీ ప్లేయర్​ వొన్ని లిపై(Yvonne Li) 21-12, 21-18 తేడాతో విజయం సాధించింది. 37 నిమిషాల పాటు సాగిందీ మ్యాచ్​. అంతకుముందు బుధవారం జరిగిన మ్యాచ్​లో జపాన్ క్రీడాకారిణి అయా ఒహోరిపై 17-21, 21-17, 21-17 తేడాతో గెలిచింది.

మరి కాసేపట్లో భారత ప్లేయర్లు సాయిప్రణీత్​.. ఫ్రెంచ్​ ప్లేయర్​ క్రిస్ట్రో(Christo Popov) తలపడనుండగా.. సాత్విక్​సాయిరాజ్​ రంకిరెడ్డి-చిరాగ్​ శెట్టి ద్వయం.. దక్షిణ​కొరియా ఆటగాళ్లు కంగ్-సియోతో(​Kang Minhyuk-Seo Seungjae) పోటీ పడనున్నారు.

ఇదీ చూడండి: బీడబ్ల్యూఎఫ్‌ అథ్లెట్స్‌ కమిషన్‌ ఎన్నికల్లో సింధు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.