జబర్దస్త్​ 'సుడిగాలి సుధీర్' టీమ్​ సంచలన నిర్ణయం- ఇదే లాస్ట్!

author img

By

Published : Dec 7, 2021, 7:23 PM IST

sudigali sudheer

Sudigali Sudheer team change: జబర్దస్త్​లో సుడిగాలి సుధీర్​ టీమ్​కు ఉండే క్రేజే వారు. సినిమాల్లో బ్రహ్మానందం కనిపిస్తే ఆటోమెటిగ్గా నవ్వేసినట్టుగా.. బుల్లితెరపై గెటప్ శ్రీను, సుధీర్, ఆటో రామ్​ప్రసాద్ ఏదో ఒక మాయ చేసి నవ్వించేస్తారు. ఇన్నేళ్ల పాటు కలిసి పనిచేసి, లక్షలాది ప్రేక్షకులను నవ్విస్తూ వచ్చిన ఈ కమెడియన్లు త్వరలో షాకింగ్ వార్త చెప్పేలా కనిపిస్తున్నారు.

Sudigali Sudheer: 'జబర్దస్త్​'లో 'సుడిగాలి సుధీర్​' టీమ్​ అంటే నవ్వులకు పెట్టింది పేరు. వైవిధ్యమైన కామెడీతో సుధీర్, శ్రీను, రామ్​ప్రసాద్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంటారు. ఒక్కోసారి అసలు ఏ కాన్సెప్ట్​ లేకున్నా ఏదో ఒక మాయ చేసి నవ్వుల సునామీ సృష్టిస్తారు. అలాంటి అదిరిపోయే కాంబినేషన్​ వారిది. అయితే ఈ టీమ్​లో త్వరలో మార్పులు రానున్నాయా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇటీవలే విడుదలైన ప్రోమోనే అందుకు కారణం.

sudigali sudheer
'సుడిగాలి సుధీర్​' టీమ్

డిసెంబర్​ 10న ప్రసారంకానున్న ఎక్స్​ట్రా జబర్దస్త్​ షోకు సంబంధించిన ప్రోమోలో శ్రీను, సుధీర్, రామ్​ప్రసాద్​ తొలుత టీమ్​లో కొత్త వారిని చేర్చేందుకు ప్రయత్నించారు. రాకెట్ రాఘవ, హైపర్ ఆది ఇళ్లకు వెళ్లి మరీ ఈ విషయం అడిగారు. అయితే.. కాసేపటికే సుధీర్, శ్రీను, రామ్​ప్రసాద్​ భావోద్వేగానికి గురికావడం కనిపించింది. ఇన్నాళ్లూ తమను ఆదరించిన ప్రేక్షకులను ధన్యవాదాలు చెబుతూనే.. 'ఇకపై జబర్దస్త్​ నుంచి మేము..' అంటూ క్షమాపణలు చెబుతూ ముగించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: Sudigali sudheer movies: సుడిగాలి సుధీర్​ టెన్షన్ టెన్షన్?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.