'ఢీ' షోలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎంట్రీ అదుర్స్

author img

By

Published : Nov 26, 2021, 1:44 PM IST

dhee final allu arjun chief guest

'ఢీ' కింగ్స్ వర్సెస్ క్వీన్స్ ఫినాలేకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్​గా విచ్చేశారు. అందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం అభిమానుల్ని అలరిస్తుంది.

దక్షిణాదిలోనే అతిపెద్ద డ్యాన్స్‌ రియాల్టీ షో 'ఢీ' 13వ సీజన్‌ తుది అంకానికి చేరుకుంది. కింగ్స్‌ వర్సెస్‌ క్వీన్స్‌ కాన్సెప్ట్‌తో ప్రారంభమైన ఈ సీజన్‌ ఆద్యంతం ప్రేక్షకుల్ని అలరించింది. అతి త్వరలో ఈ డ్యాన్స్‌ షో గ్రాండ్‌ఫినాలే మరింత గ్రాండ్‌ లెవల్‌లో జరగనుంది. ఈ వేడుకకు ఐకాన్‌స్టార్‌ అల్లుఅర్జున్‌ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. ఈ మేరకు అల్లు అర్జున్‌ ఎంట్రీకి సంబంధించిన ఓ సరికొత్త ప్రోమోని 'ఢీ' టీమ్‌ శుక్రవారం విడుదల చేసింది.

'పుష్ప' చిత్రంలోని 'ఏయ్‌ బిడ్డా.. ఇది నా అడ్డా' పాటతో బన్నీ సూపర్‌ ఎంట్రీ ఇచ్చారు. మరోవైపు, 'ఆర్య 2' సమయంలో జరిగిన 'ఢీ 3' గ్రాండ్‌ఫినాలేకు బన్నీ-సుకుమార్‌ కలిసి విచ్చేశారు. ఇప్పుడు పదేళ్లు, పది సీజన్ల తర్వాత బన్నీ ఈ సీజన్‌కు మళ్లీ గెస్ట్‌గా రావడం ఎంతో ఆనందంగా ఉందని అభిమానులు పేర్కొంటున్నారు.

'ఢీ' విషయానికి వస్తే.. ప్రతి బుధవారం ఈటీవీలో ప్రసారమయ్యే ఈ షోకు ప్రియమణి, గణేశ్‌ మాస్టర్‌, పూర్ణ న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. సుధీర్‌-హైపర్‌ ఆది, రష్మి-దీపిక టీమ్‌ లీడర్లుగా, ప్రదీప్‌ వ్యాఖ్యాతగా అలరిస్తున్నారు. ఎంతో హోరాహోరీగా సాగుతోన్న ఈ షోలో ఎవరు విజయం సాధిస్తారో తెలియాల్సి ఉంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.