బాలయ్య-మహేశ్​బాబు 'అన్​స్టాపబుల్​'.. ఫ్యాన్స్​కు పండగే

author img

By

Published : Dec 4, 2021, 8:33 PM IST

Updated : Dec 5, 2021, 2:04 PM IST

balakrishna, mahesh babu

Unstoppable with NBK: బాలయ్య టాక్​ షోలో మహేశ్​బాబు పాల్గొన్నారు. శనివారం షూటింగ్​ జరిగిన ఈ ఎపిసోడ్​.. ఎప్పుడెప్పుడు ప్రసారమవుతుందా అని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Unstoppable with NBK: 'అఖండ' సినిమాతో థియేటర్ల దగ్గర దుమ్ములేపుతున్న బాలయ్య.. మరోవైపు ఓటీటీలోనూ అదరగొడుతున్నారు. 'అన్​స్టాపబుల్ విత్ ఎన్​బీకే' టాక్​ షోతో అభిమానుల్ని అలరిస్తున్నారు.

ఇటీవలే ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం, డైరెక్టర్ అనిల్ రావిపూడి పాల్గొన్న మూడో ఎపిసోడ్​ రిలీజ్​ కాగా.. ఇప్పుడు నాలుగో ఎపిసోడ్​ కోసం సూపర్​స్టార్ మహేశ్​బాబు వచ్చారు. శనివారం షూటింగ్​ జరిగింది. అందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి. దీంతో అటు బాలయ్య, ఇటు మహేశ్​ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

Unstoppable with NBK superstar mahesh babu
అన్​స్టాపబుల్ షోలో పాల్గొన్న మహేశ్​బాబు

ఇటీవల ఎన్టీఆర్ 'ఎవరు మీలో కోటీశ్వరులు' టాక్​ షోలో పాల్గొన్న మహేశ్​బాబు.. తనదైన మార్క్ టైమింగ్​తో అలరించారు. ఆ ఎపిసోడ్​ అభిమానులకు కనువిందు చేసింది. ఇలా రోజుల వ్యవధిలో బాబాయ్, అబ్బాయితో కలిసి మహేశ్​ సందడి చేయడం విశేషం.

మహేశ్​ నటించిన 'సర్కారు వారి పాట' షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. బ్యాంక్​ రుణాల ఎగవేత నేపథ్య కథతో తీస్తున్న ఈ సినిమాలో మహేశ్ సరసన కీర్తి సురేశ్ హీరోయిన్​గా చేస్తోంది. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 1న థియేటర్లలోకి రానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

mahesh babu
సర్కారు వారి పాట

ఇదీ చదవండి:

'అఖండ' మ్యూజిక్.. సౌండ్​ బాక్సులు పగిలిపోతాయి!

బాలయ్య 'అఖండ' సినిమాకు తొలిరోజు భారీ వసూళ్లు

Last Updated :Dec 5, 2021, 2:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.