'ఆర్ఆర్ఆర్' టీమ్ సంక్రాంతి విషెస్.. కొత్త సినిమా టీజర్ల సందడి

author img

By

Published : Jan 14, 2022, 6:07 PM IST

RRR movie

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో ఆర్ఆర్ఆర్, విరుమన్, భళా తందనాన, హీరో, కర్ణ, బెస్ట్ కపుల్, కొత్తకొత్తగా చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి.

RRR movie sankranthi: 'ఆర్ఆర్ఆర్' టీమ్.. అభిమానులకు సంక్రాంతి, భోగి పండగ శుభాకాంక్షలు చెప్పింది. కొత్త పోస్టర్​ను కూడా రిలీజ్ చేసింది. త్వరలో రిలీజ్ డేట్ వెల్లడిస్తామని తెలిపింది.

RRR movie sankranthi poster
ఆర్ఆర్ఆర్ మూవీ సంక్రాంతి పోస్టర్

రామ్​చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఈ సినిమాలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్​ హీరోయిన్లుగా చేశారు. అజయ్ దేవ్​గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతమందించారు. రాజమౌళి దర్శకుడు.

Karthi viruman First look: కార్తి హీరోగా నటిస్తున్న 'విరుమన్' సినిమా ఫస్ట్​లుక్.. శుక్రవారం రిలీజైంది. ముత్తయ్య దర్శకత్వం వహిస్తున్నారు. హీరో సూర్య.. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఏడాది వేసవిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

karthi viruman movie
కార్తి విరుమన్ ఫస్ట్​లుక్

*శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న కొత్త సినిమా 'భళా తందనాన'. ఇందులోని 'మీనాచ్చి మీనాచ్చి' అంటూ సాగే గీతం.. శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రంలో కేథరిన్ హీరోయిన్​గా చేస్తోంది. చైతన్య దంతులూరి దర్శకత్వం వహిస్తున్నారు. మణిశర్మ సంగీతమందిస్తున్నారు. 'హీరో' సినిమాలోని 'బుర్ర పాడవుతాందే' పూర్తి వీడియో సాంగ్​ను భోగి పండగ సందర్భంగా రిలీజ్ చేశారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
  • " class="align-text-top noRightClick twitterSection" data="">

*అలానే భోగి పండగను పురస్కరించుకుని 'కర్ణ', 'బెస్ట్ కపుల్', 'కొత్త కొత్తగా' సినిమాల టీజర్లు రిలీజ్ అయ్యాయి. ఇవన్నీ త్వరలో థియేటర్లలోకి రానున్నాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
  • " class="align-text-top noRightClick twitterSection" data="">
  • " class="align-text-top noRightClick twitterSection" data="">
.
.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.