'రియల్ దండుపాళ్యం' రిలీజ్‌కు రెడీ

'రియల్ దండుపాళ్యం' రిలీజ్‌కు రెడీ
Real dandupalyam movie: 'దండుపాళ్యం' సిరీస్‌లో రానున్న కొత్త సినిమా రియల్ 'దండుపాళ్యం'. ఈ నెల 21న చిత్రం రిలీజ్ కానున్న సందర్భంగా విశేషాలను వెల్లడించారు నిర్మాతలు.
Dandupalyam movies: రాగిణి ద్వివేది, మేఘన రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ద్విభాషా చిత్రం 'రియల్ దండుపాళ్యం'. మహేష్ దర్శకుడు. రామ్‌ధన్ మీడియా వర్క్స్‌తో కలిసి సి.పుట్టస్వామి నిర్మించారు. ఈ సినిమా తెలుగు, కన్నడ భాషల్లో ఈనెల 21న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే నిర్మాత సురేష్ కొండేటి మంగళవారం హైదరాబాద్‌లో ట్రైలర్ విడుదల చేశారు.
"దండుపాళ్యం' సిరీస్ తెలుగు, కన్నడ భాషల్లో ఎంత ఆదరణ దక్కించుకుందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు వాటన్నింటికీ మించేలా 'రియల్ దండుపాళ్యం' ఉండనుంది. మగాళ్ల వంచనకు గురైన ఐదుగురు అమ్మాయిల కథే ఈ చిత్రం. ప్రతి సన్నివేశాన్ని ఎంతో రియలిస్టిక్‌గా తెరకెక్కించారు దర్శకుడు మహేష్. ఈ చిత్రం ప్రస్తుతం జరుగుతున్న ఎన్నో సంఘటనలకు అద్దం పట్టేలా ఉంటుంది" అని నిర్మాతలు చెప్పారు.
ఇవీ చదవండి:
