రవితేజ 'రావణాసుర' షురూ.. క్లాప్​ కొట్టిన మెగాస్టార్

author img

By

Published : Jan 14, 2022, 11:52 AM IST

Updated : Jan 14, 2022, 5:00 PM IST

ravi teja ravanasura movie

Ravi teja ravanasura movie: మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా, రవితేజ కొత్త సినిమా పూజా కార్యక్రమం జరిగింది. 'రావణాసుర' టైటిల్​తో తెరకెక్కుతున్న ఈ చిత్రం.. సెప్టెంబరు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Ravi teja chiranjeevi: మాస్ మాహారాజా రవితేజ 'రావణాసుర' సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. హైదరాబాద్​లో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. క్లాప్​ కూడా ఆయనే కొట్టారు.

రవితేజ 'రావణాసుర' లాంచ్ ఈవెంట్

మాస్ ఎంటర్​టైనర్​గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజతోపాటు యువ కథానాయకుడు సుశాంత్ నటిస్తున్నారు. ఫరియా అబ్దుల్లా, పూజిత, మేఘా ఆకాశ్, అను ఇమ్మన్యూయేల్, దక్షా నగర్కార్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు.

ఈ నెలలో షూటింగ్ ప్రారంభం కానుందని, ఈ ఏడాది సెప్టెంబరు 30 సినిమా థియేటర్లలోకి రానుందని చిత్రబృందం వెల్లడించింది. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తుండగా, అభిషేక్ నామా నిర్మిస్తున్నారు.

ravi teja ravanasura movie
రవితేజ 'రావణాసుర' మూవీ
ravi teja ravanasura movie
రవితేజ 'రావణాసుర' మూవీ టీమ్​తో చిరంజీవి
Last Updated :Jan 14, 2022, 5:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.