ప్రభాస్​ చేతుల మీదుగా కాజల్​ సాంగ్.. మరో పాన్​ఇండియా సినిమా వాయిదా

author img

By

Published : Jan 27, 2022, 7:24 PM IST

sara ali khan and vicky kaushal movie

Dulquer Salmaan Kajal Agarwal Movie: సినిమా అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో దుల్కర్ సల్మాన్, కాజల్​ నటిస్తున్న కొత్త సినిమా, 'విక్రాంత్ రోణ' సహా పలు చిత్రాల విశేషాలున్నాయి.

Dulquer Salmaan Kajal Agarwal Movie: మలయాళ స్టార్​ నటుడు దుల్కర్​ సల్మాన్ నటిస్తోన్న కొత్త చిత్రం 'హే సినామిక'. కాజల్ అగర్వాల్, అదితీ రావు హైదరీ కథానాయికలు. బృందా దర్శకుడు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఈ చిత్రం నుంచి 'ప్రాణం' అనే పాటను డార్లింగ్ ప్రభాస్ విడుదల చేశారు. గోవింద్ వసంత సంగీతమందిన ఈ మెలొడీ గీతం ఆద్యంతం ఆకట్టుకుంటోంది.

విక్కీ-సారా షూటింగ్​ పూర్తి..

sara ali khan and vicky kaushal movie
విక్కీ కౌశల్-సారా అలీఖాన్

బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్-సారా అలీఖాన్ జంటగా నటిస్తున్న కొత్త చిత్రం షూటింగ్ పూర్తైంది. లక్ష్మణ్ ఉటేకర్​ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖారారు చేయలేదు. దినేశ్ విజన్ నిర్మాత. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.

'విక్రాంత్​ రోణ' వాయిదా

కన్నడ స్టార్​ కిచ్చా సుదీప్​ పాన్​ ఇండియా సినిమా 'విక్రాంత్​ రోణ' విడుదల వాయిదా పడింది. భారత్​ సహా ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా.. ఫిబ్రవరి 24న రిలీజ్​ కావాల్సిన ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

vikrant rona
'విక్రాంత్​ రోణ' రిలీజ్ వాయిదా

ఈ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్. తెలుగు, హిందీ, తమిళ, మలయాళం, కన్నడతో పాటు మరో ఐదు విదేశీ భాషల్లో ఈ చిత్రం రిలీజ్​ కానుంది. అనూప్​ భండారి దర్శకత్వం వహించారు.

వెబ్​సిరీస్​లో మాధురీ దీక్షిత్..

madhuri dixit
'ది ఫేస్​ గేమ్'​

బాలీవుడ్ సీనియర్​ నటి మాధురీ దీక్షిత్.. వెబ్​సిరీస్​లోకి అడుగుపెట్టారు. 'ది ఫేస్​ గేమ్'​ అనే సిరీస్​తో ఆమె అలరించనున్నారు. దీనిని ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. ఓటీటీ నెట్​ఫ్లిక్స్​లో ఫిబ్రవరి 25 నుంచి సిరీస్​ ప్రసారం కానుంది. ఇందులో బాలీవుడ్​ ఐకాన్ అనామికా ఆనంద్​ పాత్రలో మాధురి నటించనున్నారు.

'మిథ్య'లో హ్యూమా ఖురేషీ..

huma qureshi
'మిథ్య'లో హ్యూమా

జీ5 ఓటీటీ వేదికగా 'మిథ్య' అనే వెబ్​సిరీస్​లో నటించనున్నారు బాలీవుడ్ భామ హ్యూమా ఖురేషీ. ఇందులో అవంతిక దస్సానీ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. రోహన్ సిప్పి దర్శకుడు. 2019లో వచ్చిన బ్రిటిష్ సిరీస్​ 'చీట్' ఆధారంగా దీనిని రూపొందిస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: Nani: 'దసరా' మూవీ కోసం అంత ఖర్చుతో భారీ సెట్‌?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.