ఆనందంగా ఉండాలంటే ఇలా చేయండి: పూరీ జగన్నాథ్​

author img

By

Published : Jan 13, 2022, 9:46 PM IST

purijagannadh

Puri jagannadh puri musings: కొంతకాలం విరామం తర్వాత మళ్లీ దర్శకుడు పూరీజగన్నాథ్​ 'పూరీ మ్యూజింగ్స్​' పేరిట మరో కొత్త విషయాన్ని తెలిపారు. మనిషి ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలో వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

Puri jagannadh puri musings: టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ 'పూరీ మ్యూజింగ్స్‌' పేరిట ఎన్నో ఆసక్తికర విషయాల్ని పంచుకుంటుంటారు. కొంతకాలం విరామం అనంతరం ఆయన మరో పాడ్‌కాస్ట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మనిషి ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలో తెలియజేస్తూ 'ఇకిగాయ్‌' అనే కొత్త కాన్సెప్ట్‌ను వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

"ఆనందం కోసం జపనీయుల దగ్గర 'ఇకిగాయ్‌' (ikigai) అనే ఓ కాన్సెప్ట్‌ ఉంది. ఎక్కువగా డబ్బు సంపాదించటం, మన కోరకల్ని తీర్చుకోవటం, అన్నీ వదిలేసి సన్యాసం తీసుకోవటం.. వీటిల్లో మనం ఏం చేస్తే జీవితంలో ఆనందంగా ఉంటాం? అనే విషయాన్ని తెలుసుకోవాలి. ప్రతి మనిషికీ ఒక ఇకిగాయ్‌ ఉండాలి. పూర్వం మనుషులంతా వేటగాళ్లలా బతికారు. తర్వాత మన జాబ్స్‌ మారిపోయాయి. కొత్తకొత్త పనులు పుట్టుకొచ్చాయి. కొందరికి పెయింటింగ్‌ అంటే ఇష్టం, మరికొందరికి డ్యాన్స్‌ అంటే ఇష్టం. అలాంటి ఇష్టమైన పనులు చేస్తుంటే అనవసరమైన ఆలోచనలు దరిచేరవు.. పైగా ఎంతో ఆనందం వస్తుంది. కానీ, డబ్బు ఎవరిస్తారు? అందుకే ఏదో ఒక ఉద్యోగంలో చేరుతుంటాం. కంఫర్టబుల్‌ జీవితం కావాలంటే మనందరికీ డబ్బు కావాలి. అది ఎంత మొత్తమో ఎవరికీ తెలియదు. ఈ నాలుగు విషయాల్లో మీరు ఎందులో ఉన్నారో చెక్‌ చేసుకోండి. 1. నీకు నచ్చింది చేయటం. 2. ప్రపంచానికి నచ్చింది చేయటం. 3. ఎక్కువ డబ్బు వచ్చేది చేయటం. 4. నువ్వు ఎందులో స్పెషలిస్టువో ఆ రంగంలో పనిచేయటం. మీరు 1& 4 మధ్య ఉంటే అది ప్యాషన్‌ . మీరు అలా బతుకుతుంటే దాని ద్వారా డబ్బెలా సంపాదించాలో ఆలోచించండి. ఒకవేళ మీరు 1& 2 మధ్య ఉంటే అది మిషన్‌ . మీ పనిని ఇంకా బాగా ఎలా చేయాలో ఆలోచించండి. 3& 4 మధ్య ఉంటే అది ప్రొఫెషన్‌. ఇందులో మీకు ఇష్టమైనవి, కొత్తకొత్త విషయాలు తెలుసుకోవాలి. 2& 4 మధ్య ఉంటే ఒకేషన్‌. చేస్తున్నదాన్ని సవాలుగా తీసుకుని ఇంకా బెటర్‌ అయ్యేలా చూడాలి. ముఖ్యంగా మనకేం కావాలో తెలియాలి. మనం ఏం చేస్తున్నామో తెలియాలి. అదే ఇకిగాయ్‌ (రీజన్‌ ఫర్‌ యువర్‌ బీయింగ్‌)" అని పూరీ తెలిపారు.

ఇదీ చూడండి: Puri Jagannadh Birthday: మాస్​ చిత్రాలకు కేరాఫ్​ అడ్రస్​.. పూరీ జగన్నాథ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.