'అఖండ'.. పాన్ వరల్డ్ సినిమా: హీరో బాలకృష్ణ
Updated on: Jan 12, 2022, 1:53 PM IST

'అఖండ'.. పాన్ వరల్డ్ సినిమా: హీరో బాలకృష్ణ
Updated on: Jan 12, 2022, 1:53 PM IST
Akhanda celebration: 'అఖండ'.. పాన్ వరల్డ్ సినిమా అయిందని హీరో బాలయ్య చెప్పారు. ఈ చిత్రం గురించి పాకిస్థాన్‌లో కూడా మాట్లాడుకుంటున్నారని అన్నారు.
Akhanda movie: 'అఖండ' సంక్రాంతి సంబరాలు.. హైదరాబాద్‌లో బుధవారం ఈవెంట్ నిర్వహించారు. సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాల్ని హీరో బాలయ్య చెప్పారు. తమ సినిమా గురించి పాకిస్థాన్‌లోనూ మాట్లాడుకుంటున్నారని అన్నారు.
అఖండ గురించి ప్రపంచం అంతా మాట్లాడుకుంటుందని.. ఇది పాన్ ఇండియా సినిమా కాదని, పాన్ వరల్డ్ సినిమా అని హీరో బాలకృష్ణ అన్నారు. పాకిస్థాన్‌లో అఖండ గురించి మాట్లాడుకుంటున్నారని, ఈ విషయాన్ని ఎవరో తనకు వాట్సాప్ చేశారని ఆయన పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు తెలుగు సినిమాకు సహాయ సహకారాలు అందిచాలని కోరారు.
అలానే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కోసం ఇంటర్‌పోల్ గాలిస్తుందని బాలయ్య అన్నారు. అందుకే ఈ కార్యక్రమానికి రాలేదని పంచ్‌లు వేశారు. ఆయన కొట్టిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్కు విదేశాల్లో సౌండ్ బాక్సులు పగిలిపోయానని, అందుకే ఇంటర్‌పోల్ వెతుకుతుందని బాలకృష్ణ చెప్పుకొచ్చారు.
'అఖండ' సినిమాలో అఘోరాగా, ఓటీటీలో 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే' టాక్ షోకు హోస్ట్‌గా బంపర్ సక్సెస్ కొట్టారు.
ఇవీ చదవండి:
