Liger movie: 'లైగర్' సెట్లో బాలయ్య.. ఏమన్నారంటే?
Updated on: Sep 22, 2021, 2:39 PM IST

Liger movie: 'లైగర్' సెట్లో బాలయ్య.. ఏమన్నారంటే?
Updated on: Sep 22, 2021, 2:39 PM IST
నటసింహం బాలయ్య.. 'లైగర్' సెట్లో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను చిత్రబృందం పోస్ట్ చేసింది. ప్రస్తుతం 'లైగర్'(liger movie) షూటింగ్ గోవాలో జరుగుతోంది.
నందమూరి బాలకృష్ణ(balakrishna movies).. 'లైగర్'(liger movie) టీమ్‌కు సర్ప్రైజ్ ఇచ్చారు. గోవాలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. అయితే అక్కడికి వెళ్లిన ఆయన చిత్రబృందంతో కలిసి ముచ్చటించారు. అలానే సినిమా విజయం సాధించాలని ఆశీర్వదించారు. 'లైయన్ విత్ లైగర్' అంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
బాక్సర్‌గా విజయ్
మార్షల్ ఆర్ట్స్ కథతో తీస్తున్న 'లైగర్'లో విజయ్ దేవరకొండ(vijay devarakonda movies) బాక్సర్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే చాలాభాగం షూటింగ్ జరిగింది. ఇటీవల గోవాలో కొత్త షెడ్యూల్ మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే బాలయ్య సెట్లో సందడి చేయడం.. 'లైగర్' టీమ్‌లో జోష్ నింపింది.
పాన్ ఇండియా స్థాయిలో తీస్తున్న ఈ సినిమాలు పలు భాషల నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనన్య పాండే హీరోయిన్. రమ్యకృష్ణ, విజయ్‌కు తల్లిగా నటిస్తోంది.
'పైసా వసూల్' కాంబో రిపీట్?
బాలయ్యతో 'పైసా వసూల్' లాంటి మాస్ సినిమాను పూరీ జగన్నాథ్(puri jagannadh movies) తీశారు. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. దీంతో మరోసారి బాలకృష్ణతో సినిమా చేస్తానని గతంలోనే పూరీ చెప్పారు. దీంతో ఈ కాంబినేషన్ మరోసారి సెట్ ఎప్పుడు అవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ఇవీ చదవండి:
