బాలయ్య 'అఖండ' ట్రైలర్​కు టైమ్​ ఫిక్స్

author img

By

Published : Nov 13, 2021, 5:51 PM IST

balakrishna akhanda

బాలయ్య ఫ్యాన్స్​ ఎంతగానో ఎదురుచూస్తున్న అప్డేట్ వచ్చేసింది. 'అఖండ' ట్రైలర్ రిలీజ్ డేట్​ను ప్రకటించారు. నవంబరు 14న విడుదల చేస్తున్నట్లు కొత్త పోస్టర్​ను రిలీజ్ చేశారు.

నందమూరి బాలకృష్ణ 'అఖండ' ట్రైలర్ రిలీజ్ డేట్ ప్రకటించారు. నవంబరు 14 సాయంత్రం 7:09 గంటలకు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించారు. దీంతో బాలయ్య అభిమానులు ఫుల్ జోష్​లో ఉన్నారు.

ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్​గా నటించింది. శ్రీకాంత్, పూర్ణ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. తమన్ సంగీతమందించగా, బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు.

balakrishna akhanda trailer
అఖండ మూవీలో బాలకృష్ణ

ఇప్పటికే విడుదలైన 'అఖండ' రోర్, టైటిల్​ సాంగ్ సినిమాపై అంచనాల్ని పెంచుతున్నాయి. ఈ సినిమాలో బాలయ్య రెండు డిఫరెంట్​ గెటప్స్​లో కనిపించనున్నారు. అందులో అఘోరా రోల్​ కూడా ఉండటం విశేషం.

మరోవైపు బాలయ్య కొత్త సినిమా శనివారమే లాంఛనంగా ప్రారంభమైంది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్​గా శ్రుతిహాసన్​ నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతగా వ్యవహరిస్తోంది.

సినిమాలే కాకుండా ఓటీటీలోనూ 'అన్​స్టాపబుల్ విత్ ఎన్​బీకే' షోలో హోస్ట్​గా బాలయ్య చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు ఎపిసోడ్​లు.. అభిమానుల్ని అలరిస్తున్నాయి. తొలి ఎపిసోడ్​కు మోహన్​బాబు, రెండో ఎపిసోడ్​కు నాని అతిథులుగా వచ్చారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.