వాట్సాప్ కొత్త అప్డేట్​.. ఇకపై 7 రోజులు కాదు.. 24 గంటలే

author img

By

Published : Dec 7, 2021, 12:45 PM IST

WhatsApp

Whatsapp Latest Update: వాట్సాప్​ మరో అప్​డేట్​తో రానుంది. ఇప్పటికే ఉన్న డిస్అప్పీయరింగ్​ ఫీచర్​కు తుది మెరుగులు దిద్దింది. సాధారణంగా 7 రోజులకు ఆటోమేటిక్​గా డిలీట్​ అయ్యే మెసేజ్​లు కొత్త అప్​డేట్​తో 24 గంటల్లోనే కనిపించకుండాపోనున్నాయి.

Whatsapp Latest Update: దిగ్గజ మెసెంజర్​ వాట్సాప్​.. ఎప్పటికప్పుడు యాప్​ను అప్​డేట్​ చేస్తూ వినియోగదారులకు సరికొత్త ఫీచర్లను అందిస్తుంది. ఈ నేపథ్యంలో మరో అప్​డేట్​​ను అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికే వాట్సాప్​లో ఉన్న డిసప్పీయరింగ్​​​ ఫీచర్​కు మరిన్ని మెరుగులు దిద్దింది. ఇప్పటి వరకు కేవలం నిర్ణీత కాల వ్యవధితో మాత్రమే మెసేజ్​లు అటోమేటిక్​గా డిలీట్​ అయ్యేవి. అయితే వాట్సాప్​ త్వరలో తీసుకురానున్న ఫీచర్​తో వాటి కాల వ్యవధి మరింత కుదించడంతో పాటు పొడిగించనుందని 'ది వర్జ్'​ అనే సంస్థ తెలిపింది.

వాట్సాప్​లో మెసేజ్​లు ఆటోమేటిక్​ డిలీట్ అవ్వాలి అంటే.. యూజర్, కాంటాక్ట్​ లేదా గ్రూప్​ ఇన్​ఫోలోకి వెళ్లి డిసప్పీయరింగ్​ ఆప్షన్​ను ఎంచుకోవాలి. ఇలా చేస్తే మెసేజ్​లు 7 రోజుల తరువాత ఆటోమేటిక్​గా డిలీట్​ అవుతాయి. అయితే వాట్సాప్​ తాజాగా తీసుకువస్తున్న ఫీచర్​తో ఆ 7 రోజులుగా ఉన్న ఆప్షన్​ను​ 24 గంటలకు కుదించుకోవడంతో పాటు 90 రోజుల వరకు పెంచుకునే అవకాశాన్ని కల్పించింది. దీంతో ఎంచుకున్న సమయం తర్వాత మెసేజ్​లు ఆటోమేటిక్​గా డిసప్పీయర్​ అయ్యేలా వీలు కల్పించింది. దీనికోసం యూజర్స్ డిసప్పీయరింగ్​ ఆప్షన్​ను క్లిక్​ చేస్తే... వచ్చే ఈ మూడు ఆప్షన్స్​లో ఏదో ఒక దానిని ఎంచుకోవాలి.

ఈ కొత్త ఫీచర్​ 'వన్​ టూ వన్​' చాట్​తో పాటు గ్రూప్​కు కూడా వర్తిస్తాయిని సంస్థ తెలిపింది. ఈ డిసప్పీయరింగ్​ మెసేజెస్​ అనే ఆప్షన్​ను వాట్సాప్​ గతేడాది నవంబర్​లో తీసుకొచ్చింది.

ఇదీ చూడండి: శాటిలైట్​ ఇంటర్నెట్​​ కనెక్షన్​ కావాలా? ఏడాదికి రూ.లక్షన్నర కట్టాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.