వీడియో కాల్​లో స్క్రీన్​ షేరింగ్​.. వాట్సాప్​లో సూపర్ ఫీచర్​!

author img

By

Published : May 29, 2023, 5:27 PM IST

whatsapp-new-features-2023-whatsapp-video-call-screen-sharing-feature

Whatsapp Video Call Screen Sharing Eeature : వాట్సాప్ మరో కొత్త ఫీచర్​ను ప్రవేశపెట్టనుంది. వీడియో కాల్ చేసే వారికి ఈ ఫీచర్​ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఆ ఫీచర్​ గురించి ఇప్పుడు పూర్తి సమాచారం తెలుసుకుందాం.

Whatsapp Video Call Screen Sharing Feature : ఎప్పటికప్పుడు వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా కొత్త కొత్త ఫీచర్లను వాట్సాప్ తీసుకువస్తోంది. తాజాగా మరో కొత్త ఫీచర్​ యూజర్లకు పరిచయం చేసేందుకు వాట్సాప్​ సిద్ధమైంది. కుటుంబసభ్యులకు, స్నేహితులకు వీడియో కాల్​ చేసేందుకు​.. చాలా మంది వాట్సాప్​నే ఉపయోగిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే వీడియో కాల్​ మాట్లాడే సమయంలో స్క్రీన్​ షేరింగ్​ ఫీచర్​ను వాట్సాప్ త్వరలోనే​ ప్రవేశపెట్టనుంది. దీంతో వీడియో కాల్​ విషయంలో చాలా కాలంగా వినియోగదారులు కోరుకుంటున్న కొత్త ఫీచర్​ అందుబాటులోకి రాబోతుంది. అయితే ఆండ్రాయిడ్​ వెర్షన్​లోనూ ఈ ఫీచర్​ పనిచేస్తుందా అన్న విషయం ఇంకా తెలియాల్సి ఉంది. వీడియో కాల్​ మాట్లాడుతుండగా.. కాల్​ కంట్రోల్​లో​ కొత్తగా తీసుకువచ్చిన సింబల్​పై క్లిక్​ చేయడం ద్వారా స్క్రీన్​ షేరింగ్​ చేయవచ్చని వాట్సాప్​ ప్రతినిధులు తెలిపారు.

వాట్సాప్​ ప్రవేశపెట్టబోయో ఈ కొత్త ఫీచర్​లో వీడియో కాల్​ మాట్లాడుతుండగానే.. మన మొబైల్​ స్క్రీన్​ను అవతలి వారికి​ షేర్​ చేయవచ్చు. చెల్లింపుల వివరాలు, ఫొటోలు, మెస్సేజ్​లు, వంటి వాటిని వీడియో కాల్​లోనే.. వారికి చూపించవచ్చు. ఆడియో సైతం వినిపించవచ్చు. జూమ్​, మైక్రోసాఫ్ట్​ టీమ్స్, గుగూల్​ మీట్​​ వంటి ఇతర యాప్​లలో.. వీడియో కాల్​ స్క్రీన్​ షేరింగ్​ సదుపాయం చాలా కాలంగా ఉంది. అదే తరహాలో ఇప్పుడు వాట్సాప్​ కూడా ఈ వీడియో కాల్ స్క్రీన్​​ షేరింగ్​ ఫీచర్​ను​ తీసుకువస్తోంది. కుటుంబసభ్యులు, స్నేహితులతో వీడియో కాల్​ మాట్లాడుకునే సందర్భాల్లో ఈ ఫీచర్​ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. వారికి మొబైల్​లో ఉన్న పొటోలు, ఇతర సమాచారం చూపించేందుకు తోడ్పడుతుంది.

వాట్సాప్‌లో మెసేజ్ ఎడిట్ ఫీచర్ 15 నిమిషాల్లోపే ఛాన్స్​ ఆ తర్వాత..
వాట్సాప్ ఇటీవలె ఓ కొత్త అప్​డేట్​ను యూజర్ల కోసం తీసుకువచ్చింది. అదే ఎడిట్​ మెసేజ్​ ఫీచర్​. సాధారణంగా వాట్సాప్​లో ఎవరికైనా మెసేజ్ పంపించే ముందు టైప్ చేస్తుంటే అక్షర దోషాలు వస్తుంటాయి. అవి చూసుకోకుండా సెండ్ బటన్ మీద క్లిక్ చేసి మనం పంపించేస్తాం. ఆ తర్వాత చూసుకుని అరెరే పెద్ద సమస్య వచ్చి పడిందే అని డిలీట్ చేయడమో లేక దాని తర్వాత సరిచేసి వేరే మెసేజ్ టైప్​ చేసి పంపుతాం. అదే మెసేజ్​ కాస్త పెద్దదైతే మళ్లీ టైప్ చేయలేక కాపీ చేసి దాన్నే సరిచేసి పంపుతాం. ఇంత ప్రాసెస్ అవసరమా? అదే మెసేజ్​ను ఎడిట్ చేసే అవకాశం ఉంటే బాగుంటుంది కదా అని మనకు అనిపిస్తుంటుంది. అయితే పంపిన మెసేజ్​ను ఎడిట్ చేసే ఫీచర్​ను వాట్సాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. పొరపాటున తప్పుగా మెసేజ్ పంపినా ఎడిట్ చేసుకునే వీలు కల్పించింది​. దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.