ఇక సెల్​ఫోన్​లోనే టీవీ!.. త్వరలో డైరెక్ట్​-టు-మొబైల్​ ప్రసారాలు.. దిల్లీలో పైలట్ ప్రాజెక్ట్​గా..

author img

By

Published : Nov 18, 2022, 6:49 AM IST

Updated : Nov 28, 2022, 1:07 PM IST

tv in mobiles phones

యాప్‌ల ద్వారానే వివిధ కార్యక్రమాలు చూస్తున్న వారికి గుడ్​న్యూస్​. అన్నిరకాల టీవీ కార్యక్రమాలనూ నేరుగా సెల్‌ఫోన్‌కే ప్రసారం చేసే విధానం త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ముందుగా పైలట్‌ ప్రాజెక్టుగా దీన్ని దేశ రాజధాని ప్రాంతంలో అమలుచేస్తామని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ కార్యదర్శి చెప్పారు.

ఇప్పటివరకు కొన్నిరకాల యాప్‌ల ద్వారానే వివిధ కార్యక్రమాలు చూస్తున్న వారికి శుభవార్త. అన్నిరకాల టీవీ కార్యక్రమాలనూ నేరుగా సెల్‌ఫోన్‌కే ప్రసారం చేసే విధానం త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ముందుగా పైలట్‌ ప్రాజెక్టుగా దీన్ని దేశ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్‌)లో అమలుచేస్తామని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ కార్యదర్శి అపూర్వచంద్ర గురువారం తెలిపారు. ఇది దాదాపు ఎఫ్‌ఎం రేడియోలాగే పనిచేస్తుంది. అందులో రేడియో ఫ్రీక్వెన్సీని అందుకునేందుకు ఒక రిసీవర్‌ ఉంటుంది.

బ్రాడ్‌బ్యాండ్‌, బ్రాడ్‌కాస్ట్‌ సాంకేతికతలను కలిపి మొబైల్‌ ఫోన్లలో డిజిటల్‌ టీవీ కార్యక్రమాలు అందుకునేలా చేస్తారు. తద్వారా స్మార్ట్‌ఫోన్లకు మల్టీమీడియా కంటెంట్‌ నేరుగా వస్తుంది. భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఆధ్వర్యంలో జరిగిన 'బిగ్‌ పిక్చర్‌ సమిట్‌'లో మాట్లాడుతూ, టీవీ ప్రసారాలు నేరుగా సెల్‌ఫోన్‌కు అందితే వీక్షకుల సంఖ్య కొన్ని రెట్లు పెరుగుతుందని అపూర్వ చంద్ర అన్నారు. 'ప్రస్తుతం దేశంలో 20 కోట్ల టీవీలే ఉన్నాయి. కానీ, 60 కోట్ల స్మార్ట్‌ఫోన్లు, 80 కోట్ల బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్లు ఉన్నాయి. అందువల్ల టీవీ మీడియా ప్రజలకు మరింత చేరువ అవుతుంది. దీనిపై బెంగళూరులో ఇప్పటికే ఐఐటీ కాన్పుర్‌, శాంఖ్య ల్యాబ్స్‌ ఒక పరిశోధన చేశాయి. త్వరలో నొయిడా లేదా దిల్లీ ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో పైలట్‌ ప్రాజెక్టు ప్రారంభిస్తాం' అని ఆయన వివరించారు.

దేశంలో 120 కోట్ల మంది మొబైల్‌ వినియోగదారులు ఉండగా, వారిలో 60 కోట్ల మంది స్మార్ట్‌ఫోన్ల ద్వారా అపరిమిత సమాచారం, వినోదం పొందుతున్నారని చంద్ర చెప్పారు. యువతరం సంప్రదాయ మీడియా నుంచి కొత్త మీడియా వైపు మళ్లుతున్నారని, అందువల్ల విశ్వసనీయత సవాలుగా మారిందని అన్నారు.

టీఆర్పీ రేటింగులకు కొత్త వ్యవస్థ
టీఆర్పీ రేటింగుల అంశంపైనా ప్రభుత్వం ఆలోచిస్తోందని చంద్ర చెప్పారు. రివర్స్‌ పాత్‌ డేటా (ఆర్‌పీడీ) పైలట్‌ ప్రాజెక్టు విజయవంతం అయ్యిందని తెలిపారు. 'బ్రాడ్‌కాస్ట్‌ ఆడియెన్స్‌ రీసెర్చ్‌ కౌన్సిల్‌' (బార్క్‌) రేటింగ్స్‌ చాలా తక్కువ ఇళ్లతోనే చూస్తారని, ఆర్‌పీడీ వల్ల టీఆర్పీ మరింత మెరుగ్గా వస్తుందని ఆయన తెలిపారు. ఆర్‌పీడీ ఉండే సెట్‌టాప్‌ బాక్సులు ఆ టీవీలో చూసే ఛానళ్ల సమాచారాన్ని నిల్వ చేసుకుని, దానిని కేబుల్‌ ఆపరేటర్‌కు తిరిగి పంపుతుంది. ఆ సమాచారాన్ని బార్క్‌ పొందగలదు.

ఇవీ చదవండి:వాట్సాప్​లో పోల్ ఫీచర్.. ఎలా క్రియేట్ చేయాలో తెలుసా?

యూట్యూబ్​ కింగ్​గా 'మిస్టర్ బీస్ట్'.. సబ్​స్క్రైబర్ల సంఖ్యలో ప్యూడీపై రికార్డ్ బ్రేక్

Last Updated :Nov 28, 2022, 1:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.