Cyber Crime: ఆండ్రాయిడ్​ ఫోన్ ఉందా.. ఈ కొత్త వైరస్​తో జాగ్రత్త!

author img

By

Published : Sep 26, 2021, 1:27 PM IST

Cyber Crime, Android malware

రోజుకో రకం నేరం.. రెచ్చిపోతోంది సైబర్‌ కేటుగాళ్ల లోకం. మాల్​వేర్​ అనే వైరస్​ను ఆండ్రాయిడ్​ ఫోన్​లలోకి ప్రవేశ పెట్టి వారి వ్యక్తిగత, బ్యాంకింగ్​ సమాచారాన్ని ఎక్కడో ఇంట్లో కూర్చొని ఆపరేట్​ చేస్తున్న హ్యాకర్​కు (Cyber Crime) అందజేస్తుంది. యూజర్​లను నమ్మించేందుకు గవర్నమెంట్​ యాప్​లను పోలిన రూపంలో ఇవి కనిపిస్తూ... ప్రజలను మోసం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సీఈఆర్​టీ-ఇన్​ హెచ్చరించింది.

డ్రినిక్​ పేరుతో సైబర్​ నేరగాళ్లు వదిలిన ఓ మాల్​వేర్ (Malware Virus) ఆండ్రాయిడ్​ యూజర్లకు ముచ్చెమటలు పట్టిస్తోంది. చూస్తుండగానే బ్యాంక్​ ఖాతాలోని నగదును ఖాళీ చేసే ఈ వైరస్ (Cyber Crime)​.. ఆండ్రాయిడ్​ యూజర్లను భయపెడుతోంది. చూడడానికి అచ్చం ఇన్​కమ్​ ట్యాక్స్​ అప్లికేషన్​లా ఉండే ఈ మాల్​వేర్​ వినియోగదారుల ఫోన్​లోకి దూరి బ్యాంకింగ్​కు సంబంధించిన సమాచారంతో పాటు ఇతర వ్యక్తిగత విషయాలను కూడా హ్యాకర్లకు(Hacker) చేరవేస్తోందని ది ఇండియన్​ కంప్యూటర్​ ఎమర్జెన్సీ రెస్పాన్స్​ టీం(సీఈఆర్​టీ-ఇన్​) తెలిపింది. ఈ మేరకు పలు బ్యాంకులకు ఈ మాల్​వేర్​కు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వడం సహా తగు సూచనలు చేసింది. 'సీఈఆర్​టీ-ఇన్​' చెప్పిన దాని ప్రకారం.. ఇప్పటికే 27 బ్యాంకులకు చెందిన వినియోగదారుల డేటాను ఈ మాల్​వేర్​ హ్యాక్​ చేసిందని పేర్కొంది.

ఆదమరిస్తే అంతే..

ఈ డ్రినిక్​ మాల్​వేర్​ ప్రధాన లక్ష్యం.. వినియోగదారుల బ్యాంకింగ్​ సమాచారాన్ని కొల్లగొట్టడం. అందుకోసం సులభమైన ఇన్​కమ్​ ట్యాక్స్​ యాప్​ రూపంలో ఇది ఉంటుంది. హ్యాకర్​కు కావాల్సిన సమాచారాన్ని దొంగలించేందుకు ముందుగా మెసేజ్​ లేక ఈ మెయిల్​ రూపంలో ఓ లింక్​ను పంపుతాడు. అందులోనూ ఈ మెయిల్​, మెసేజ్​లు కూడా అచ్చం గవర్నమెంట్​ పంపిన వాటిని పోలి ఉంటాయి. దీనిని నమ్మి యూజర్​ డౌన్​లోడ్​ చేసుకుంటే.. మీ ఫోన్​లో ప్రవేశించడానికి కావాల్సిన అన్నీ అనుమతులు కోరుతుంది. అంతటితో ఆగకుండా మీ పూర్తిపేరు, ఆధార్​ నంబర్​, పాన్​ నంబర్​, పుట్టిన రోజు, చిరునామా, ఫోన్​ నంబర్​, ఈ మెయిల్​ ఐడీ లాంటి వివరాలు పొందుపరిచేలా ఒక ఫాం ఓపెన్​ అవుతుంది. అది పూర్తి చేసిన తరువాత ముందుకు అడుగేద్దాం అనుకుంటే.. బ్యాంకింగ్​లో అతి కీలక సమాచారమైన అకౌంట్​ నంబర్​, ఐఎఫ్​ఎస్​సీ కోడ్​, సీఐఎఫ్​ కోడ్​, డెబిట్​ కాడ్​ వివరాలు, ఎక్స్​పైరీ డేట్​, సీవీవీ, పిన్​ లాంటి సమాచారం అంతా సేకరిస్తుంది. ఇలా చేస్తే మీరు చేసిన లావాదేవీలోని డబ్బు తిరిగి మీకు అందుతుంది అనే చెప్తుంది. సరే అని మీరు ముందుకు అడుగేశారు అంటే ఒక్కసారిగి పూర్తి సమాచారం అంతా హ్యాకర్​ చేతికి చేరుతుంది. చివరగా ఏదో పొరపాటు జరిగింది అని ఎర్రర్​ మెసేజ్​ చూపిస్తుంది.

దీని నుంచి జాగ్రత్తపడడం ఎలా?

సీఈఆర్​టీ-ఇన్​ సంస్థ చెప్పిన దాని ప్రకారం.. మనకు అనుమానస్పదంగా ఉండే ఎటువంటి లింక్​లను ఓపెన్​ చేయకపోవడం మంచిది. అది ఈ మెయిల్​లో వచ్చినా లేక మెసేజ్​ రూపంలో వచ్చినా. అంతేగాకుండా మనకు తెలియని యాప్స్​ను, ఇతర సైట్లను కూడా ఓపెన్​ చేయకపోవడం ఉత్తమం.

ఇదీ చూడండి: కరోనాను ఆసరాగా చేసుకుని హ్యాకింగ్.. జాగ్రత్త సుమా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.