వన్​ప్లస్​ 9 ఫోన్స్​​, స్మార్ట్​వాచ్​ ధరలు, ఫీచర్లు ఇవే..

author img

By

Published : Mar 24, 2021, 12:42 PM IST

oneplus 9 Series smartphones features and prices

దేశీయ మార్కెట్లోకి ఓకేసారి మూడు స్మార్ట్​ఫోన్లను, తొలి స్మార్ట్​వాచ్​ను విడుదల చేసింది వన్​ప్లస్​. మూడు స్మార్ట్​ఫోన్లలో రెండు హై ఎండ్ ఫోన్లుగా, ఒక వేరియంట్​ను మిడ్​ రేంజ్​ సెగ్మెంట్లో తీసుకొచ్చింది. ఈ మూడు ఫోన్ల ప్రత్యేకతలు, ధరలు సహా స్మార్ట్​వాచ్​ విశేషాలు చూసేయండి.

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్​ఫోన్ల తయారీ సంస్థ వన్​ప్లస్​ ఒకేసారి పెద్ద ఎత్తున కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించింది. వన్​ప్లస్​ 8 సరీస్​కు అప్​గ్రేడ్ వెర్షన్​గా వన్​ ప్లస్​ 9ను ఆవిష్కరించింది. వన్​ప్లస్ 9 సిరీస్​లలో ఒకేసారి మూడు మోడళ్లను విడుదల చేసింది.

oneplus 9 modesl
వన్​ప్లస్ 9 మోడల్స్​

వన్​ ప్లస్​ 9, వన్​ ప్లస్​ 9ప్రో, వన్​ ప్లస్​ 9ఆర్​ పేర్లతో ఈ మోడళ్లను తీసుకొచ్చింది. ఈ మూడు ఫోన్లు 5జీ వేరియంట్​లు కావడం గమనార్హం. మూడు కొత్త ఫోన్లతో పాటు తొలి స్మార్ట్​వాచ్​ను విడుదల చేసింది వన్​ప్లస్​.

వన్​ప్లస్​​ 9 ఫీచర్లు, ధర..

  • 6.55 అంగుళాల ఫుల్​ హెచ్​డీ డిస్​ప్లే
  • స్నాప్​డ్రాగన్​ 888 ప్రాసెసర్
  • వెనుకవైపు మూడు కెమెరాలు(48 ఎంపీ ప్రధాన కెమెరా+50 ఎంపీ అల్ట్రావైడ్​+2ఎంపీ మోనో క్రోమ్​)
  • 16 ఎంపీ పంచ్​ హోల్​ సెల్ఫీ కెమెరా
  • 4,500 ఎంఏహెచ్​ బ్యాటరీ, 65 వాట్స్ ఫాస్ట్​ ఛార్జింగ్ (వైర్​), 15 వాట్స్​ ఫాస్ట్ ఛార్జింగ్​ (వైర్​లెస్​)
  • ఆండ్రాయిడ్​ 11 ఆధారంగా పనిచేసే ఆక్సిజన్ ఓఎస్​
  • 8జీబీ ర్యామ్​+128 జీబీ స్టోరేజ్​ వేరియంట్ ధర రూ.49,999
  • 12జీబీ ర్యామ్​+256 జీబీ స్టోరేజ్​ వేరియంట్ ధర రూ.54,999

వన్​ప్లస్​ 9 ప్రో ఫీచర్లు, ధర..

  • 6.7 అంగుళాల క్యూ​ హెచ్​డీ డిస్​ప్లే
  • స్నాప్​డ్రాగన్​ 888 ప్రాసెసర్
  • వెనుకవైపు నాలుగు కెమెరాలు(48 ఎంపీ ప్రధాన కెమెరా+50 ఎంపీ అల్ట్రావైడ్​+8 ఎంపీ టెలిఫోటోలెన్స్+ 2ఎంపీ మోనో క్రోమ్​)
  • 16 ఎంపీ పంచ్​ హోల్ సెల్ఫీ కెమెరా
  • 4,500 ఎంఏహెచ్​ బ్యాటరీ, 65 వాట్స్ ఫాస్ట్​ ఛార్జింగ్ (వైర్​), 50 వాట్స్​ ఫాస్ట్ ఛార్జింగ్​ (వైర్​లెస్​)
  • ఆండ్రాయిడ్​ 11 ఆధారంగా పనిచేసే ఆక్సిజన్ ఓఎస్​
  • 8జీబీ ర్యామ్​+128 జీబీ స్టోరేజ్​ వేరియంట్ ధర రూ.64,999
  • 12జీబీ ర్యామ్​+256 జీబీ స్టోరేజ్​ వేరియంట్ ధర రూ.69,999
    Oneplus 9, 9 pro
    వన్​ ప్లస్​ 9, 9ప్రో

వన్​ప్లస్​ 9ఆర్ ఫీచర్లు, ధర..

  • 6.55 అంగుళాల ఫుల్​​ హెచ్​డీ డిస్​ప్లే
  • స్నాప్​డ్రాగన్​ 870 ప్రాసెసర్
  • వెనుకవైపు నాలుగు కెమెరాలు(48ఎంపీ+16ఎంపీ+5ఎంపీ+2ఎంపీ)
  • 16 ఎంపీ పంచ్​ హోల్ సెల్ఫీ కెమెరా
  • 4,500 ఎంఏహెచ్​ బ్యాటరీ, 65 వాట్స్ ఫాస్ట్​ ఛార్జింగ్
  • ఆండ్రాయిడ్​ 11 ఆధారంగా పనిచేసే ఆక్సిజన్ ఓఎస్​
  • 8జీబీ ర్యామ్​+128 జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర రూ.39,999
  • 12జీబీ ర్యామ్​+256 జీబీ స్టోరేజ్​ వేరియంట్ ధర రూ.43,999
    Oneplus 9R
    వన్​ప్లస్​ 9ఆర్​

స్మార్ట్​వాచ్​ ఫీచర్లు, ధర..

  • ఇరువైపులా రెండు బటన్లతో రౌండ్​ డయల్
  • వివిధ వర్క్​అవుట్ మోడ్​లు
  • గుండె వేగం పర్యవేక్షణ
  • స్లీప్​ ట్రాకింగ్
  • కాల్స్​ రిసీవ్ చేసుకోవడం, నోటిఫికేషన్స్​ చూడగలగటం, మీడియా ప్లేబ్యాక్
  • వన్​ప్లస్​ టీవీ రిమోట్​
  • ఆర్​టీఓఎస్ ఆధారిత కస్టమ్​ మేడ్ ఓఎస్​తో
  • 4జీబీ ఇంటర్నల్​ స్టోరేజ్, ఫాస్ట్​ ఛార్జింగ్​ సపోర్ట్​
    oneplus smart watch
    వన్​ప్లస్​ స్మార్ట్​ వాచ్​

స్మార్ట్​వాచ్​ ధరను రూ.16,999గా నిర్ణయించింది వన్​ప్లస్​. ప్రారంభ ఆఫర్​ కింద దీనిని రూ.14,999కు విక్రయిస్తోంది. ఎస్​బీఐ క్రెడిట్​ కార్డు ద్వారా దీనిని కొనుగోలు చేస్తే మరో రూ.2 వేలు డిస్కౌంట్ లభించనుంది.

ఇదీ చదవండి:'ఓటీటీల నియంత్రణ' పిటిషన్లపై సుప్రీం స్టే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.