తక్కువ ధరలో ట్యాబ్ కొనాలా? ఇవి చూడండి...

author img

By

Published : Nov 21, 2021, 5:02 PM IST

Tablets

మొబైల్‌, పీసీలతో పోలిస్తే మార్కెట్లో అందుబాటులో ఉన్న ట్యాబ్‌లెట్స్‌ మోడల్స్‌(best tablets) తక్కువే. ప్రస్తుతం వీటి వినియోగం భారీగా పెరిగింది. అందుబాటు ధరలో అదిరే ఫీచర్స్​తో ఉత్తమమైన ట్యాబ్​ మోడల్స్(Best tablet models)​ ఏమిటి?

స్మార్ట్‌ఫోన్‌ డిస్‌ప్లే సరిపోదు.. ల్యాప్‌టాప్‌ డిస్‌ప్లే మరీ పెద్దది అవుతుంది. మరి ఈ రెండింటికీ మధ్యస్థంగా ఉండే డిస్‌ప్లే అనగానే గుర్తొచ్చేది ట్యాబ్‌లే. మొబైల్‌, పీసీలతో పోలిస్తే మార్కెట్లో అందుబాటులో ఉన్న ట్యాబ్‌లెట్స్‌ మోడల్స్‌(best tablets) తక్కువనే చెప్పుకోవాలి. ఇటీవలి కాలంలో వీటి వినియోగం పెరగడంతో గ్యాడ్జెట్ కంపెనీలు వీటి తయారీపై దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలో డిస్‌ప్లే, బ్యాటరీ, కనెక్టివిటీ పరంగా ఉత్తమమైన ట్యాబ్‌ మోడల్స్‌ ఏంటి? వాటి ధరెంత? ఇతర ఫీచర్ల వివరాల గురించి తెలుసుకుందాం.

లెనోవా ట్యాబ్ ఎమ్‌10 హెచ్‌డీ ప్లస్‌ (Lenovo Tab M10 HD Plus)

ఈ ట్యాబ్ ఆండ్రాయిడ్ 9 ఓఎస్‌తో పనిచేస్తుంది. 10.3 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ డిస్‌ప్లే ఇస్తున్నారు. మీడియాటెక్ హీలియో పీ22టీ ప్రాసెసర్‌ ఉపయోగించారు. రెండు కెమెరాలున్నాయి. వెనుకవైపు 8 ఎంపీ, ముందు భాగంలో 5 ఎంపీ కెమెరా ఇస్తున్నారు. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 10 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 4 జీబీ ర్యామ్‌/128 జీబీ ఇంటర్నల్ మెమొరీ వేరియంట్ ధర రూ. 20,999.

Tablets
లెనోవా ట్యాబ్ ఎమ్‌10 హెచ్‌డీ ప్లస్‌

రియల్‌మీ పాడ్ (Realme Pad)

రియల్‌మీ పాడ్‌ ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్‌మీ యూఐ ఓఎస్‌తో పనిచేస్తుంది. వెనుక, ముందు 8 ఎంపీ హెచ్‌డీ కెమెరాలున్నాయి. 4జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తుంది. ఈ పాడ్‌లో మల్టీ విండో మోడ్ ఇస్తున్నారు. దీంతో ఒకేసారి ట్యాబ్‌లో రెండు వేర్వేరు యాప్‌లను ఓపెన్ చేసి ఉపయోగించుకోవచ్చు. ఆన్‌లైన్ క్లాసులు, వీడియో కాల్స్‌ మాట్లాడేందుకు వీలుగా ఇందులో నాయిస్‌ క్యాన్సిలేషన్ ఫీచర్‌తో రెండు మైకులు ఇస్తున్నారు. అలానే ఫేస్‌ రికగ్నిషన్ పీచర్‌ కూడా ఉంది.

Tablets
రియల్‌మీ పాడ్

మీడియాటెక్‌ హీలియో జీ80 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. రియల్‌మీ పాడ్‌లో 7,100 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్‌ క్విక్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అలానే ఓటీజీ కేబుల్ సాయంతో రివర్స్ ఛార్జింగ్ టెక్నాలజీని సపోర్ట్ చేస్తుంది. రియల్‌మీ పాడ్‌లో 10.4 అంగుళాల డబ్ల్యూయూఎక్స్‌జీఏ+ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఇందులోని డిస్‌ప్లే టెక్నాలజీ నైట్‌ మోడ్‌లో బ్రైట్‌నెస్‌ని 2 యూనిట్లు తగ్గించుకుంటుంది. దానివల్ల కళ్లపై ఒత్తిడి తగ్గుతుందని రియల్‌మీ తెలిపింది. ఈ ట్యాబ్‌ మూడు వేరియంట్లలో లభిస్తుంది. 3 జీబీ ర్యామ్‌/ 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ వైఫై వేరియంట్‌ ధర రూ. 13,999. 3 జీబీ ర్యామ్‌/32 జీబీ 4జీ+వైఫై వేరియంట్‌ ధర రూ. 15,999. 4 జీబీ/64 జీబీ వైఫై+4జీ వేరియంట్‌ ధర రూ. 17,999.

శాంసంగ్‌ గెలాక్సీ ఏ7 లైట్‌ (Samsung Galaxy A7 Lite (LTE & Wifi))

ఆండ్రాయిడ్ ఓఎస్‌తో ఈ ట్యాబ్‌ పనిచేస్తుంది. 8.7 అంగుళాల డబ్ల్యూఎక్స్‌జీఏ+ టీఎఫ్‌టీ డిస్‌ప్లే ఇస్తున్నారు. 5,100 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. మీడియా టెక్ MT8768T ప్రాసెసర్‌తో ఉపయోగించారు. రెండు కెమెరాలున్నాయి. వెనుక 8 ఎంపీ, ముందు 2 ఎంపీ కెమెరా అమర్చారు. దీనికి శాంసంగ్ నాక్స్‌ సెక్యూరిటీ ఫీచర్‌తో రక్షణ కల్పిస్తున్నారు. చిన్నారుల కోసం శాంసంగ్ 3 జీబీ ర్యామ్/32 జీబీ అంతర్గత మెమొరీ వేరియంట్‌లలో లభిస్తుంది. ఇక వైఫై వేరియంట్‌ ధర రూ. 9,999కాగా, ఎల్‌టీఈ (సిమ్‌ కార్డ్‌) వేరియంట్‌ ధర రూ. 12,999.

Tablets
శాంసంగ్‌ గెలాక్సీ ఏ7 లైట్‌

లెనోవా యోగా స్మార్ట్ ట్యాబెలెట్ (Lenovo Yoga smart Tablet)

యోగా స్మార్ట్ ట్యాబ్‌లో 10.1 అంగుళాల డిస్‌ప్లే ఇస్తున్నారు. స్నాప్‌డ్రాగన్‌ 439 ప్రాసెసర్‌ ఉపయోగించారు. 7,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. గూగల్ అసిస్టెంట్‌, వైఫై కనెక్టివిటీ ఫీచర్స్‌ ఉన్నాయి. 4జీ ఎల్‌టీఈని సపోర్ట్ చేస్తుంది. 4 జీబీ ర్యామ్‌/64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ. 20999.

Tablets
లెనోవా యోగా స్మార్ట్ ట్యాబెలెట్

నోకియా టీ20 (Nokia T20)

ఈ ట్యాబ్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఓఎస్‌తో పనిచేస్తుంది. 400 నిట్స్‌ పీక్ బ్రైట్‌నెస్‌తో 10.4 అంగుళాల 2కే డిస్‌ప్లే ఇస్తున్నారు. ఆక్టాకోర్ యూనిసాక్ టీ610 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇందులో రెండు కెమెరాలున్నాయి. వెనుక 8 ఎంపీ కెమెరాతోపాటు ముందు భాగంలో 5 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. నాయిస్‌ క్యాన్సిలేషన్ ఫీచర్‌తో డ్యూయల్‌ మైక్రోఫోన్స్‌, ఓజో ప్లేబాక్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. 8,200 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 15 వాట్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. మూడు వేరియంట్లలో ఈ ట్యాబ్‌ను తీసుకొచ్చారు. 3 జీబీ ర్యామ్‌/32 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్ వైఫై వేరియంట్ ధర రూ. 15,499. 4 జీబీ ర్యామ్‌/32 జీబీ వైఫై వేరియంట్ ధర రూ. 16,499. 4 జీబీ ర్యామ్/32 జీబీ 4జీ వేరియంట్ ధర రూ. 18,499.

Tablets
నోకియా టీ20

శాంసంగ్ గెలాక్సీ ఏ7 వైఫై (Samsung Galaxy A7 Wi-Fi)

గెలాక్సీ ఏ7 వైఫైలో 10.4 అంగుళాల డబ్ల్యూయూఎక్స్‌జీఏ+ టీఎఫ్‌టీ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఆక్టాకోర్ ప్రాసెసర్‌ ఉపయోగించారు. ఆండ్రాయిడ్ ఓఎస్‌తో పనిచేస్తుంది. రెండు కెమెరాలున్నాయి. వెనుక 8 ఎంపీ, ముందు 5 ఎంపీ కెమెరా అమర్చారు. క్వాడ్ స్టీరియో సౌండ్ స్పీకర్లున్నాయి. 7,040 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. 3 జీబీ ర్యామ్‌/32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వైఫై వేరియంట్ ధర రూ. 17,999.

Tablets
శాంసంగ్ గెలాక్సీ ఏ7 వైఫై

ఇదీ చూడండి: మీ కంప్యూటర్‌ నెమ్మదించిందా? పరుగులు పెట్టించండిలా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.