ఆవిష్కరణలు చేసిన అద్భుతాలు - 30 ఏళ్లలో ఎన్ని మార్పులో..

author img

By

Published : Aug 29, 2021, 10:32 AM IST

The wonders of innovation

సాంకేతికత(Technology news) విషయంలో గత 30 ఏళ్లు చాలా కీలకమైనవి. మానవ జీవితాన్ని మార్చేసిన ఎన్నో ఆవిష్కరణలు (Innovations in India) గత మూడు దశాబ్దాల్లోనే జరిగాయి. అవి మన రోజు వారీ జీవితాన్ని సౌకర్యవంతం కూడా చేశాయి. మరి ఆవిష్కరణలు ఏమిటి? మానవ జీవితాలను (How Human lifes Changed with Innovations) అవి ఎలా మలుపు తిప్పాయి?

ప్రపంచవ్యాప్తంగా సాంకేతికత పరంగా (Technology news) గత 30 ఏళ్లలో వినూత్న ఆవిష్కరణలు (Innovations in India) జరిగాయి. ఒక్కో ఆవిష్కరణది ఒక్కో ప్రత్యేకత. కానీ వాటన్నింటి ఉద్దేశం.. మానవ జీవితాలను ఎంతో సౌకర్యవంతంగా మార్చడమే.

ఒకప్పుడు ఎవరితోనైనా మాట్లాడాలంటే.. టెలిఫోన్​(Telephone) ద్వారా అది కూడా ఎస్​టీడీ బూత్​ నుంచో.. అతి కొద్ది మంది దగ్గర ఉండే పర్సనల్ ల్యాండ్ ఫోన్​ నుంచో కుదిరేది. క్రమక్రమంగా ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు దాదాపు ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్​ఫోన్​(Smartphone) ఉంటోంది. దీనితో ఎప్పుడైనా.. ఎవరితోనైనా.. మాట్లాడుకునే వెసులుబాటు వచ్చింది(Smartphone Changes Human life). ఇలా.. గడిచిన 30 ఏళ్లలో మానవ జీవితాలను ఎక్కువగా ప్రభావితం చేసిన ఆవిష్కరణలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

Old model Land phone
పాత తరం ల్యాండ్ ఫోన్​

ఇంటర్నెట్

ఇంటర్నెట్.. 1990 ప్రాంతంలో ప్రారంభమైంది. దీనిని వరల్డ్ వైడ్ వెబ్ (WWW) అంటారు. అప్పటి వరకు క్లిష్టంగా ఉన్న సమాచార బదిలీ ప్రక్రియను ఇంటర్నెట్(Internet) పూర్తిగా మార్చివేసింది. ఇంటర్నెట్​ కూడా కాలంతో పాటే మారుతూ.. ఇప్పుడు ప్రతి అవసరానికి తప్పనిసరి అనే వరకు చేరింది. ఇంకా చెప్పాలంటే ప్రస్తుతం మానవ జీవితాన్ని ఇంటర్నెట్ లేకుండా ఊహించుకోవడం కూడా కష్టమే.

జీపీఎస్

గ్లోబల్ పొజిషనింగ్ సిస్టంను (జీపీఎస్​) అమెరికా తమ మిలటరీ అవసరాల కోసం అభివృద్ధి చేసింది. అనంతరం సాధారణ ప్రజలు కూడా వాడుకునేలా మార్పులు చేసింది. ఇది కూడా 1990 ప్రాంతంలో అందుబాటులోకి వచ్చింది. ఒకప్పుడు ఏ ప్రాంతానికైనా వెళ్లాల్సి వస్తే.. అక్కడి ప్రాంతాలు.. వెళ్లాల్సిన దారి విషయంలో సందేహాలు ఉండేవి. జీపీఎస్​తో ఆ సమస్య తీరిపోయింది. జీపీఎస్​ ద్వారా ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలన్నా ముందుగానే అక్కడ ఏమున్నాయ్​.. ఎలా వెళ్తే త్వరగా చేరుకోగలం.. అనే వివరాలతో పాటు.. ట్రాఫిక్​ వంటి విషయాలు తెలుసుకునేందుకు వీలుంది.

GPS map
జీపీఎస్​ ద్వారా పని చేసే మ్యాప్​

కాలర్ ఐడీ

మొదటి తరం మొబైల్ ఫోన్లలో.. ఫోన్ స్వీకరించే వ్యక్తికి ఫోన్ చేస్తున్న వ్యక్తి ఎవరన్నది తెలిసేది కాదు. అప్పుడు నంబర్ సేవ్ చేసుకునే వెసులుబాటు కూడా లేదు. కాలర్ ఐడీ అందుబాటులోకి వచ్చాక ఈ సమస్య తీరిపోయింది.

మొబైల్ ఫోన్​ నుంచి స్మార్ట్ ఫోన్ల వరకు..

1990వ దశకంలో మొబైల్ ఫోన్ల ప్రస్తావన ప్రారంభమైంది. తొలి నాళ్లలో అత్యంత తక్కువ మందికి మాత్రమే ఇవి అందుబాటులో ఉండేవి. దాదాపు పదేళ్ల తర్వాత.. కేవలం కాల్స్​ మాట్లాడుకునేందుకు వీలుగా ఉండే మొబైల్ ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. టెలికాం టెక్నాలజీ అభివృద్ధి చెందుతూ.. ఇప్పుడు ఇంటర్నెట్​ కూడా వాడుకునేందుకు వీలుగా ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి.

టెక్ట్స్​ మెసేజ్​, ఈ-మెయిల్(1992)

1970,80 దశకంలో కొన్ని కంపెనీలు సందేశాలను(మెసేజ్​) అంతర్గతంగా పంపేవి. ఇంటర్నెట్ రాకతో ఈ-మెయిల్ ప్రామాణిక సమాచార బదిలీ మాధ్యమంగా మారింది. ఒకప్పుడు టెలిఫోన్ లైన్ల ద్వారా టెక్ట్స్​ మెసేజ్​లను పంపేవారు. ప్రస్తుతం పూర్తిగా ఇంటర్నెట్ ఆధారితంగా టెక్ట్స్​ మెసేజ్​ పంపే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది.

బిట్​ కాయిన్

2009లో ఈ డిజిటల్ కరెన్సీ అందుబాటులోకి వచ్చింది. ఇది హ్యాకింగ్​కు వీలు లేని బ్లాక్ చెయిన్ సాంకేతికతతో తయారైంది. ఇది ప్రారంభమైనప్పుడు దీని విలువ రూ.50 కన్నా తక్కువ. ఇప్పుడు దీని విలువ రూ.30 లక్షల పైమాటే.

Bitcoin
క్రిప్టో కరెన్సీ (బిట్​ కాయిన్​)

సెల్ఫ్ డ్రైవింగ్..

కార్ల సెల్ఫ్ డ్రైవింగ్ అనేది 2012 సంవత్సరం నుంచి ప్రారంభమైంది. జీపీఎస్​తో పాటు కృత్రిమ మేధను ఉపయోగించుకోవటం ద్వారా ఇవి పనిచేస్తాయి. ప్రస్తుతం చాలా కంపెనీలు ఈ టెక్నాలజీని పరీక్షిస్తున్నాయి. ఇవి ప్రజా రవాణాను సమూలంగా మార్చే వీలుంది. ఇప్పటికే టెస్లా(Tesla) వంటి కంపెనీలు ఆటో పైలట్ మోడ్​ను తీసుకువచ్చాయి. దీని ద్వారా కార్లు పలు నిర్ణీత పనులను స్వయంగా చేసుకోగలవు.

Self Driving feature
సెల్ఫ్​ డ్రైవింగ్ ఫీచర్​​ (టెస్లా కారులో)

సౌర విద్యుత్

పునరుత్పాదక శక్తి అంటే ఒకప్పుడు జల, వాయు విద్యుత్ మాత్రమే. సూర్యరశ్మి నుంచి విద్యుత్​ను తయారు చేసేందుకు ఉపయోగపడేవే సౌర విద్యుత్ ప్యానెళ్లతో పునరుత్పాదక విద్యుత్​ నిర్వచనమే మారిపోయింది. వీటి ఆవిష్కరణతో విద్యుత్ దీని ద్వారా సూర్య కాంతిని విద్యుత్​గా మార్చగలుగుతున్నారు. భవిష్యత్​లో విద్యుత్ ఉత్పత్తికి ఇదే ప్రథమ ప్రాధాన్యం కానుంది.

Solar panels
సౌరశక్తిని విద్యుత్​గా మార్చే సోలార్ ప్యానెళ్లు

మైక్రో పాసెసర్లు

కంప్యూటర్లు మొదట్లో భారీ ఆకారంలో ఉండేవి. ప్రాసెసర్ కూడా పెద్దగా ఉండేది. మైక్రో ప్రాసెసర్ల రాకతో కంప్యూటర్ల తీరు మారిపోయింది. మైక్రో పాసెసర్ల ఆవిష్కరణ కంప్యూటర్ల పని తీరునూ మార్చివేసింది. కంప్యూటర్ల సైజు భారీగా తగ్గించేసింది. ప్రస్తుతం వాడుతున్న కంప్యూటర్లన్నీ మైక్రో ప్రాసెసర్ల ఆధారంగా తయారైనవే.

వైద్య రంగంలో కూడా పలు ఆవిష్కరణలు గత 30 ఏళ్లలో మానవులకు అందుబాటులోకి రావటం వల్ల వైద్యారోగ్య చికిత్సలు మెరుగయ్యాయి. ఎంఆర్ఐ, గుండె నాళాల్లో వేసే స్టెంట్లు, వివిధ వ్యాధుల చికిత్సలు మానవ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఉపయోగపడుతున్నాయి.

ఇవి మాత్రమే కాకుండా.. ఎన్నో ఆవిష్కరణలు మానవ జీవితాన్ని మార్చేశాయి. మరెన్నో ఆవిష్కరణలు మరిన్ని మార్పులు తెచ్చేందుకు సిద్ధమవుతున్నాయి.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.