మీ ఫొటోతోనే వాట్సాప్ స్టిక్కర్లు.. ఇలా తయారు చేసుకోండి..

author img

By

Published : May 30, 2022, 10:32 AM IST

Updated : May 30, 2022, 10:49 AM IST

how-to-convert-your-photo-into-whatsapp-sticker

whatsapp: ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌లో మీ సొంత ఫొటోనే స్టిక్కర్‌గా మార్చడానికి ఇన్‌బిల్ట్‌ ఫీచర్‌ ఉందని మీకు తెలుసా..? లేదంటే వాట్సాప్‌లో స్టిక్కర్లు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి..

whatsapp sticker: మెసేజింగ్‌ యాప్‌లలో ఇప్పుడు స్టిక్కర్‌లదే హవా. టెక్స్ట్‌లు, ఎమోజీలు పక్కనపెట్టి స్టిక్కర్‌లను విరివిగా వాడేస్తోంది నేటి తరం. చెప్పాల్సింది సుత్తి లేకుండా, సూటిగా పంచ్‌లతో, ఫన్నీగా చెప్పడానికి.. వారే స్వయంగా స్టిక్కర్‌లను రెడీ చేసుకుంటున్నారు. ఇందుకోసం చాలా మంది థర్ట్‌-పార్టీ యాప్‌లు వినియోగిస్తున్నారు. అయితే, ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌లో మీ సొంత ఫొటోనే స్టిక్కర్‌గా మార్చడానికి ఇన్‌బిల్ట్‌ ఫీచర్‌ ఉందని మీకు తెలుసా..?లేదంటే వాట్సాప్‌లో స్టిక్కర్లు ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.

  • స్టిక్కర్ల తయారీ ఇలా.. ఏదైనా ఫొటోను స్టిక్కర్‌గా మార్చడానికి వాట్సాప్‌ వెబ్‌ లేదా పీసీల్లో ముందుగా వాట్సాప్‌ ఖాతాను లాగిన్‌ చేసుకోవాలి.
  • ఆపై కాంటాక్టుల్లో మీకు నచ్చిన చాట్‌ విండోలకు వెళ్లి.. ‘పేపర్‌ క్లిప్‌’ మాదిరి ఉండే ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.
  • అందులో ‘స్టిక్కర్‌’ ఆప్షన్‌ ఎంచుకోగానే మీకో పాప్‌ అప్‌ ఓపెన్‌ అవుతుంది.
  • ఇక్కడ మీరు స్టిక్కర్‌గా చేయాలనుకునే ఫొటోను సెలెక్ట్‌ చేసుకోవాలి.
  • అంతే, మీకు కావాల్సినట్టుగా ఫొటోను కట్‌ చేసుకొని, దానిపై టెక్స్ట్‌, ఎమోజీలు సర్దుబాటు చేసుకొని సేవ్‌ చేసుకోవచ్చు.
  • తర్వాత మీరు ముందుగా ఓపెన్‌ చేసిన చాట్‌లో ఈ స్టిక్కర్‌ను పోస్టు చేయవచ్చు.

ఇదీ చదవండి: ఎయిర్​ ట్యాక్సీలు వచ్చేస్తున్నాయ్​! ఇక గాలిలో రయ్యిన ఎగిరిపోవచ్చు!

Last Updated :May 30, 2022, 10:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.