Phone Battery Health Check : ఫోన్లన్నింటికీ బ్యాటరీయే ప్రధానం. దీనిపైనే ఫోన్ లైఫ్‌టైమ్ ఆధారపడి ఉంటుంది. ఇలాంటి కీలకమైన బ్యాటరీ పట్ల నిర్లక్ష్యం వహించవద్దంటున్నారు టెక్ నిపుణులు. ఎందుకంటే ఫోన్ బ్యాటరీపై పడే పనిభారం అంతాఇంతా కాదు. అలాంటి వస్తువు విషయంలో జాగ్రత్తలు తప్పనిసరని సూచిస్తున్నారు ఎక్స్పర్ట్స్. అందుకే మొబైల్ బ్యాటరీ లైఫ్ లేదా దాని స్థితికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. ఒకవేళ బ్యాటరీలో ఏమైనా లోపాలు లేదా సమస్యలు తలెత్తితే వెంటనే వాటిని సవరించుకునే ప్రయత్నం చేయాలి. దీనితో మీ ఫోన్ బ్యాటరీ లైఫ్ పెరగడమే కాకుండా మీ డివైజ్ ఎక్కువ కాలం పాటు మంచి కండీషన్లో ఉండేందుకు అవకాశం ఉంటుంది.
ముందే జాగ్రత్తపడడం మంచిది!
ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్నీ మొబైల్ డివైజుల్లో బ్యాటరీ లైఫ్‌ను చెక్ చేసుకునే సౌకర్యం ఉంటోంది. అయితే చాలా మంది వాటి గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ ఫోన్ బ్యాటరీ పూర్తిగా డెడ్ అయ్యాక లేదా పాడైపోయాక మార్చుకోవడం కంటే.. ముందే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మీ బ్యాటరీ తద్వారా ఫోన్ రెండూ దీర్ఘకాలం పాటు పనిచేస్తాయి. ఇందుకోసం తరచుగా బ్యాటరీ హెల్త్ కండిషన్‌ను తెలుసుకుంటూ ఉండాలి. వీక్ కండిషన్లో ఉంటే గనుక అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా అవసరమైన చర్యలు తీసుకుంటూ ఉండాలి. అందుకే ఇప్పుడు బ్యాటరీని కాపాడుకునేందుకు అనుసరించాల్సిన జాగ్రత్తలేమిటో తెలుసుకుందాం.
ఆండ్రాయిడ్ ఫోన్లో బ్యాటరీ లైఫ్‌ను ఎలా చెక్ చేయాలి?
మీ ఫోన్ నుంచి *#*#4636#*#*కు డయల్ చేస్తే, ఓ హిడెన్ మెనూను ఓపెన్ అవుతుంది. ఇది మీ డివైజ్‌కి సంబంధించి బ్యాటరీ స్టేటస్, యూసేజ్ స్టాటిస్టిక్స్, వై-ఫై కనెక్టివిటీ లాంటి అన్ని వివరాలను తెలియజేస్తుంది. అయితే ఈ ట్రిక్ అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో పనిచేయకపోవచ్చు. ఇందుకోసం మీరు గూగుల్ ప్లేస్టోర్‌లో లభించే థర్డ్-పార్టీ యాప్‌లపై ఆధారపడాల్సి ఉంటుంది.
శాంసంగ్ ఫోన్స్‌లో బ్యాటరీ హెల్త్‌ను చెక్ చేసుకోండిలా!
How To Check Battery Health In Android Mobile : 'శాంసంగ్ మెంబర్స్' అనేది ప్రీ-ఇన్స్టాల్డ్ కమ్యూనిటీ యాప్. ఇది ఇతర శాంసంగ్ యూజర్స్తోనూ కనెక్ట్ అయి ఉంటుంది. తాజా వార్తలు సహా సపోర్ట్ కంటెంట్‌ను ఇది అందిస్తుంది. అంతేకాకుండా మీ డివైజ్‌కి సంబంధించిన హార్డ్‌వేర్ స్టేటస్‌ను కూడా ఇది తెలియజేస్తుంది. అయితే బ్యాటరీకి సంబంధించిన సమగ్ర విశ్లేషణను ఈ అప్లికేషన్ ఇవ్వకపోయినప్పటికీ.. అది మంచి కండిషన్లో ఉందా? లేదా? అనేది మాత్రం మీకు చూపిస్తుంది. ఒకవేళ మీ శాంసంగ్ ఫోన్లలో శాంసంగ్ మెంబర్స్ యాప్ లేకపోతే గెలాక్సీ స్టోర్ యాప్ లేదా గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఆపై ఈ స్టెప్స్‌ను ఫాలో అవుతూ మీ బ్యాటరీ లైఫ్‌ను ఈజీగా తెలుసుకోండి.
శాంసంగ్ మెంబర్స్ > డయాగ్నోస్టిక్స్ > ఫోన్ డయాగ్నోస్టిక్స్ > బ్యాటరీ స్టేటస్
ఐఫోన్లో బ్యాటరీ కండిషన్ లేదా హెల్త్‌ను ఎలా చెక్ చేయాలి?
ఐఫోన్లో బ్యాటరీ కండిషన్‌ను చాలా సులువుగా తెలుసుకోవచ్చు. ఇందు కోసం ఎలాంటి థర్డ్ పార్టీ యాప్‌ను వాడనవసరం లేదు. కేవలం ఐఫోన్ సెట్టింగ్స్‌లో చూస్తూ సరిపోతుంది. అది ఎలా అంటే?
ఐఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి మీ ఫోన్ బ్యాటరీ యూసేజ్ సహా దాన్ని పనితీరు వివరాలను తెలుసుకోవచ్చు. ఏ అప్లికేషన్ ఎంత శాతం బ్యాటరీని వినియోగించింది? ఏది ఎక్కువ బ్యాటరీ పవర్‌ను వాడుకుంది? అనే సమాచారాన్ని ఇక్కడ గ్రాఫ్ రూపంలో మనం చూడవచ్చు. ఇందు కోసం మీరు ఈ కింద చెప్పిన స్టెప్స్ ఫాలో అవ్వండి.
సెట్టింగ్స్ > బ్యాటరీ > బ్యాటరీ హెల్త్ అండ్ ఛార్జింగ్
Phone Battery Health Check Apps : ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉన్న కొన్ని అప్లికేషన్ల ద్వారా కూడా మీ ఫోన్ బ్యాటరీ కండిషన్‌ను సులువుగా తెలుసుకోవచ్చు.
AccuBattery : ఆక్యూబ్యాటరీ.. ఈ యాప్ సాయంతో మీ డివైజ్ బ్యాటరీ కండిషన్‌ను ఇట్టే తెలుసుకోవచ్చు. ఇది మీ ఫోన్ మొత్తాన్ని సెకన్లలో స్కాన్ చేస్తుంది. మీ ఫోన్ బ్యాటరీ పని సమయం పనిచేస్తుందో తెలియజేస్తుంది. అంతేకాకుండా మీరు ఉండే స్థలంలోని ఉష్ణోగ్రత వివరాలను కూడా ఇది చూపిస్తుంది. ఈ ఆక్యూబ్యాటరీ యాప్ విశేషమేంటంటే.. ఇందులో మీరు మొబైల్ కొన్న కొత్తలో దాని బ్యాటరీ కెపాసిటీ ఏమిటి? ప్రస్తుతం ఉన్న కెపాసిటీ ఏమిటి? అనే వివరాలను కూడా తెలియజేస్తుంది. అలాగే ప్రతిరోజూ బ్యాటరీకి కావాల్సిన దానికంటే ఎక్కువసేపు ఛార్జింగ్ పెట్టడం ద్వారా కలిగే నష్టాన్ని కూడా ఇది అంచనా వేస్తుంది.
Battery Guru : బ్యాటరీ గురు.. ఇది ఒక లైట్‌వెయిట్ యాప్. దీని సాయంతో మీ ఫోన్ బ్యాటరీ వోల్టేజీ, టెంపరేచర్ సహా బ్యాటరీ స్టేటస్‌ను తెలుసుకోవచ్చు. కానీ మీ ఫోన్లోని ఇతర యాప్‌లు బ్యాటరీని ఏ విధంగా వినియోగిస్తున్నాయి? వాటిని ఎలా ఆప్టిమైజ్ చేయాలి లాంటి లోతైన విశ్లేషణనను ఇవ్వలేదు. పైగా ఈ యాప్ పూర్తి యాడ్స్‌తో నిండి ఉంటుంది. ఇది మీకు కాస్త చికాకు తెప్పించవచ్చు. మొత్తంగా చెప్పాలంటే బ్యాటరీ గురు కేవలం మీ ఫోన్ బ్యాటరీ మంచి కండిషన్లో ఉందా? లేదా? అనే సమాచారాన్ని మాత్రమే ఇస్తుంది.
CPU-Z : ఇది విస్తృతమైన ఫీచర్లు కలిగిన స్మార్ట్‌ఫోన్ అనలైజర్. ఇది కొన్ని క్షణాల్లోనే మీ ఫోన్ బ్యాటరీకి సంబంధించిన పూర్తి హెల్త్ హిస్టరీని తెలియజేస్తుంది. ఇది మీ డివైజ్ ప్రాసెసర్, ఫోన్ మోడల్, ఓఎస్ సహా సెన్సార్‌కి సంబంధించిన అన్ని వివరాలను తెలుపుతుంది. పైగా ఇందులో యాడ్స్ రాకపోవడం విశేషం. అయితే ఇవన్నీ తెలియజేయడానికి CPU-Z కాస్త ఎక్కువ బ్యాటరీ శక్తిని వినియోగిస్తుంది. దీనిని తగ్గించుకునేందుకు.. సెట్టింగ్స్ మెనూలోకి వెళ్లి మీకు అవసరం లేని.. CPU, GPU సహా సెన్సార్ ఫీచర్స్‌ను ఆఫ్ చేయండి.
బ్యాటరీ బ్యాడ్ కండిషన్లో ఉంటే ఏం చేయాలి?
మీ ఫోన్ బ్యాటరీ అద్భుతమైన కండిషన్లో ఉందని మీరు గుర్తిస్తే మరేం ఫర్వాలేదు. అయితే ఒకవేళ బ్యాటరీ వీక్‌గా లేదా బ్యాడ్ కండిషన్లో ఉందని మీరు గమనిస్తే గనుక దానిని (బ్యాటరీని) వెంటనే మార్చడం లేదా ఇతర ప్రత్యామ్నాయ మార్గం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాల్సి ఉంటుంది.
శాంసంగ్ సహా ఇతర డివైజ్‌ల బ్యాటరీ లైఫ్ పెరగాలంటే ఇలా చేయండి!
How To Improve Phone Battery Health :
- ఫోన్‌ను డార్క్ మోడ్‌లో వాాడాలి.
- పనికిరాని లేదా వాడని యాప్స్‌ను అన్ఇన్స్టాల్ చేయాలి
- పవర్ సేవింగ్ మోడ్‌ను ఎప్పటికీ ఎనేబుల్ చేసి పెట్టుకోవాలి.
- 80% - 90% ఛార్జింగ్ పూర్తయిన తర్వాత ఛార్జర్ పిన్ను తొలగించాలి.
- Iphone 15 Launch : టెక్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. సరికొత్త ఐఫోన్ 15, యాపిల్ వాచ్ లాంఛ్.. ఫీచర్లు ఇవే..
- IPhone Discount Sale : ఐఫోన్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. ఐఫోన్ 14, ఐఫోన్ 13లపై అదిరిపోయే డిస్కౌంట్స్!
- Apple Event 2023 : ఐఫోన్ 15 లాంఛ్‌కు అంతా రెడీ!.. యాపిల్ వాచ్, ఎయిర్‌పాడ్స్ కూడా.. ధర ఎంతంటే?