గూగుల్​ సెర్చ్​లో మీ పర్సనల్ ఇన్ఫో వస్తోందా? డిలీట్ చేయండిలా!

author img

By

Published : Sep 22, 2022, 1:28 PM IST

google personal data removal

సెర్చ్ రిజల్ట్స్​లో వ్యక్తిగత సమాచారం కనిపిస్తే దాన్ని సులభంగా తొలగించేందుకు కొత్త టూల్​ను అందుబాటులోకి తెచ్చింది గూగుల్. ప్రత్యేకించి గూగుల్​ యాప్​లో దీన్ని తీసుకొచ్చింది.

Google personal data removal : గూగుల్​ సెర్చ్ రిజల్ట్స్​లో ఒక్కోసారి మన వ్యక్తిగత సమాచారం కనిపిస్తుంటుంది. ఇంటి చిరునామా, ఫోన్ నంబర్, ఈమెయిల్​ ఐడీ వంటివి సెర్చ్ రిజల్ట్స్​లో వస్తుంటాయి. వీటిని తొలగించాలంటే గూగుల్​కు​ రిపోర్ట్​ సమర్పించాల్సి ఉంటుంది. ఇది చాలా పెద్ద ప్రక్రియ. అయితే ఈ సమస్యను అధిగమించేందుకు కొత్త టూల్​ను అందుబాటులోకి తెచ్చింది గూగుల్. ప్రస్తుతం ఈ టూల్​ను కొంతమందికి అందుబాటులోకి వచ్చింది.

Google tool for personal data : ఈ కొత్త టూల్​తో మీ వ్యక్తిగత సమాచారం కనిపించిన వెంటనే దాన్ని తొలగించాలని గూగుల్​కు రిక్వెస్ట్ పెట్టొచ్చు. కొన్ని క్లిక్స్​తో ఈ ప్రక్రియ సులభంగా పూర్తవుతుంది. అంతేకాదు మీరు చేసిన రిక్వెస్ట్​పై గూగుల్ చర్యలు తీసుకుందా? లేదా? ఫిర్యాదు స్టేటస్ ఏంటి? అనే విషయాన్ని పర్యవేక్షించే సదుపాయం కూడా ఉంటుంది.​

కొద్ది నెలల క్రితం చెప్పినట్లే.. ఇప్పుడు ఈ టూల్​ను అందుబాటులోకి తీసుకొచ్చింది. యాప్​లో కాకుండా సాధారణంగానూ గూగుల్ సెర్చ్ రిజల్ట్స్​లో వ్యక్తిగత డేటా కనిపించినప్పుడు పక్కనే ఉన్న మూడు చుక్కలపై క్లిక్​ చేసి కూడా తొలగించాలని రిక్వెస్ట్​ చేయవచ్చని తెలిపింది.

Google search result tool : సెర్చ్ రిజల్ట్స్​లో వ్యక్తిగత సమాచారాన్ని తొలగించేందుకు వీలుగా ఏప్రిల్ చివరి వారంలోనే పాలసీ అప్డేట్​ను తీసుకొచ్చింది గూగుల్​. అయితే ఆ సమాచారాన్ని హోస్ట్​ చేస్తున్న వైబ్​సైట్ల నుంచి డేటాను డిలీట్​ చేస్తామని ఎలాంటి భరోసా ఇవ్వలేదు. అందుకే కొత్త టూల్​ను తీసుకొచ్చింది గూగుల్. వ్యక్తిగత డేటాను తొలగించాలని యూజర్లు కోరినప్పటికీ, వారికి సంబంధించిన మిగతా సమాచారం విషయంలో మాత్రం ఎలాంటి పరిమితులు ఉండవని గూగుల్ స్పష్టం చేసింది.

Truecaller number Unlist : స్మార్ట్​ఫోన్​లో తప్పనిసరిగా ఉపయోగించే యాప్​లలో 'ట్రూ కాలర్' కూడా ఒకటి. యూజర్ల పేర్లు, ఫోన్ నంబర్లు, ఈ-మెయిల్ ఐడీలు, లొకేషన్ సమాచారం సహా ఇతర డేటా ట్రూకాలర్ సర్వర్‌లలో ఉంటుంది. అయితే.. ఇంత మొత్తంలో డేటా ఉండటం.. ఈ సాంకేతిక యుగంలో ఎప్పటికైనా ప్రమాదమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందుకే వ్యక్తిగత సమాచారాన్ని సెర్చ్ చేయగలిగే అవకాశం ఉన్న డేటాబేస్ నుంచి ఫోన్​ నంబర్​ను తొలగించడం లేదా అన్‌లిస్ట్ చేయడం ద్వారా డేటాను రక్షించుకోవచ్చని అంటున్నారు. అది ఎలా చేయాలో తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

How to Change Name on Truecaller : మన కాంటాక్ట్​ లిస్ట్​లో పేరు లేని వ్యక్తులు కాల్ చేసినప్పుడు.. వారి వివరాలను తెలియజేస్తుంది ట్రూ కాలర్. ఫోన్​ రింగ్​ అవడానికి ముందే ఎవరు కాల్​ చేస్తున్నారో చెప్పేస్తుంది​. అయితే కొన్నిసార్లు కాలర్​ పేరును తప్పుగా, ఇబ్బంది కలిగించేలా చూపిస్తుంటుంది. ట్రూ కాలర్​లో ఈ పేరును మనం సులభంగా మార్చుకోవచ్చు. అది ఎలానో తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవీ చదవండి: సరికొత్తగా 'ఐమెసేజ్​'.. మరిన్ని నయా ఫీచర్లతో...

వాట్సాప్ యూజర్లకు గుడ్​న్యూస్.. కొత్తగా మెసేజ్ ఎడిట్ ఫీచర్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.