Android 12: ఆండ్రాయిడ్​ కొత్త వెర్షన్​.. రిలీజ్ ఎప్పుడంటే?

author img

By

Published : Sep 16, 2021, 9:38 AM IST

Android 12

ఆండ్రాయిడ్​ లేటెస్ట్ వెర్షన్​ (Android 12) విడుదలకు సిద్ధమైంది. ప్రస్తుతం దీని బీటా వర్షన్​ అందుబాటులో ఉంది. అయితే ఈ వెర్షన్​కు తగినట్లు యాప్​లను సిద్ధం చేసుకోవాలని గూగుల్​ ఇప్పటికే డెవలెపర్స్​కు సూచించింది.

గూగుల్​ ఇటీవలే ఆండ్రాయిడ్​ 12లో (Android 12) 5వ వెర్షన్​ను విడుదల చేసింది. ఇది ఫైనల్​ వెర్షన్​గా డెవలెపర్స్​ కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ప్రజలకు ఇది చేరువ కావాలంటే మరికొన్ని వారాలు వేచిచూడక తప్పదు అని చెబుతోంది. పూర్తిస్థాయి ఆండ్రాయిడ్​ వెర్షన్​ విడుదలకు ముందే.. దీనికి తగినట్లు యాప్​లను సిద్ధం చేసుకోవాలని ఇప్పటికే డెవలెపర్స్​కు సూచించింది. కానీ ఇది ఎప్పుడు విడుదల చేస్తుందన్న విషయాన్ని కచ్చితంగా ప్రస్తావించలేదు. కానీ అక్టోబర్​ మొదటివారంలో ఉండొచ్చిన టెక్​ వర్గాలు చెబుతున్నాయి.

ముహుర్తం ఖరారు..!

ఆండ్రాయిడ్​ 12 విడుదలపై ఇప్పటికే స్పష్టమైన సమాచారం లేనప్పటికీ.. పిక్సిల్​ స్మార్ట్​ఫోన్లకు వచ్చే నెల 4న ఆండ్రాయిడ్​ 12 అందుబాటులోకి రానున్నట్లు ఎస్​డీఏ డెవలెపర్స్​ పేర్కొంది. దీనికి సంబంధించిన సోర్స్​ కోడ్​ను అమెరికాకు చెందిన ఓ కంపెనీ ఆండ్రాయిడ్​ ఓపెన్​ సోర్స్​ ప్రాజెక్ట్​ (ఏఓఎస్​పీ)లో పబ్లిష్​ చేసిందని చెప్పుకొచ్చింది. ఏదేమైనప్పటికీ.. ఆ రోజే గూగుల్​ పిక్సెల్​ సిరీస్​లోని స్మార్ట్​ఫోన్లలో అందుబాటులోకి తీసుకురానుందని పేర్కొంది.

మారే అవకాశాలు లేకపోలేదు..

ఆండ్రాయిడ్​ 12 విడుదలపై గూగుల్​ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ఈ వెర్షన్​ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోతే విడుదల తేదీని వాయిదా వేసే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే గూగుల్​ టెస్టింగ్​కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది!

విడుదలపై గూగుల్​ మాట..

ఆండ్రాయిడ్​ 12లో ఎటువంటి సాంకేతిక లోపాలు తలెత్తకుండా ఉండేందుకు గూగుల్​ ఫైనల్​ బీటా వెర్షన్​​ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది పూర్తిస్థాయిలో అధికారికంగా ప్రజలకు అందుబాటులోకి రావాలి అంటే మరికొన్ని వారాలు ఎదురు చూడాల్సి ఉంటుందని గూగుల్​ అంటుంది. ఈ సమయంలో బగ్స్​ను కనిపెట్టేందుకు అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చింది. ఈ వెర్షన్​లో కొన్ని యాప్స్​ను గూగుల్​ డీఫాల్ట్​గా ఇస్తుంది.

ఇదీ చూడండి: Apple Iphone 13: ఐఫోన్ 13 వచ్చేసింది- ఐప్యాడ్, వాచ్​ కూడా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.