ఐఫోన్​ కొత్త ఓఎస్​లో ఉండే కీలక ఫీచర్లు ఇవే!

author img

By

Published : Sep 27, 2021, 7:25 PM IST

IOS 15 Features

స్మార్ట్​ఫోన్లలో యాపిల్​ ఐఫోన్లకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఇందుకు ముఖ్యమైన కారణాల్లో దాని ఓఎస్​ కూడా ఒకటి. ఇందుకోసమే ఎప్పటికప్పుడు ఓఎస్​ను అప్​డేట్ చేస్తుంటుంది యాపిల్. ఇందులో భాగంగా కొత్త ఓఎస్​ ఐఓఎస్​ 15ను (IOS 15 Features) వారం కిందటే విడుదల చేసింది. దీనికి సంబంధించిన కీలక ఫీచర్లను చూద్దాం.

లగ్జరీ స్మార్ట్​ఫోన్ల తయారీ సంస్థ యాపిల్​.. కొత్తగా తీసుకొచ్చిన ఐఓఎస్​ 15లో (IOS 15 Features) మరిన్ని కీలక ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వాయిస్​ మెమోస్​ స్పీడ్​ తగ్గించడం, కోరిన యాప్​ ఫాంట్​ సైజ్​ను ఛేంజ్​ చేసుకోవడం లాంటి ఫీచర్లను తీసుకొచ్చింది. అంతేగాక ఫోకస్​ మోడ్​, షేర్​ ప్లే వంటి వాటిని యాపిల్​ 6ఎస్​ కంటే ముందు ఉన్న ఫోన్​లలో ఈ సంస్థ అందిస్తుంది. వీటికి తాజాగా అద్భుతమైన ఐదు హిడెన్​ ఫీచర్లును జోడించింది. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ​

IOS 15 Features
ఐఓఎస్​ 15

యాప్ ఫాంట్​ సైజ్​ మార్చుకోవచ్చు..

యాపిల్​ ఐఫోన్​ (APPLE IPHONE) వినియోగదారులు కొత్తగా వచ్చిన ఐఓఎస్​ 15తో కావాల్సిన యాప్​ల ఫాంట్​ సైజ్​ను మార్చుకునే సదుపాయం ఉంటుంది. దీంతో యాప్​లను సులువుగా గుర్తించవచ్చు. ఈ సదుపాయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ఐఫోన్​లకు వర్తిస్తుందని సంస్థ తెలిపింది. దీనిని మార్చుకునేందుకు ఓపెన్​ కంట్రోల్​ సెంటర్​ను స్వైప్​ చేయాలి. అక్కడ ఉన్న 'ఏఏ' బటన్​ను నొక్కాలి. ఆపై ఎడమవైపుకు నొక్కుతూ పోతే ఫాంట్​ సైజ్​ మారుతుంది. తరువాత సెట్టింగ్స్​ను సేవ్​ చేయాలి.

లైవ్​ టెక్ట్స్​ కాపీ పేస్ట్​..

ఐఓఎస్​ 15లో యాపిల్​ తీసుకువచ్చిన మరో కీలక ఫీచర్​.. లైవ్​ టెక్ట్స్​ కాపీ, పేస్ట్​. ఆండ్రాయిడ్​లోని గూగుల్​ లెన్స్​ పనిచేసినట్లు యాపిల్​లో ఈ ఫీచర్​ పని చేస్తుంది. కెమెరా ఆన్​ చేసి ఫొటో తీస్తుంటే.. అందులోని అక్షరాలు పైన కనిపిస్తుంటాయి. వాటిని మనం కావాలంటే కాపీ చేసుకోవచ్చు. అదే సమయంలో కోరిన చోట పేస్ట్​ చేసుకోవచ్చు. ఓ వైపు ఫోన్​ మాట్లాడుతూ కూడా ఇలా చేయవచ్చు. ఈ ఫీచర్​ను పొందడానికి సెట్టింగ్స్​లోకి వెళ్లి జనరల్..​ ఆ తరువాత లాంగ్వేజ్​ & రీజియన్​ అండ్​ ఎనేబుల్​ లైవ్​ టెక్ట్స్​ను సెలెక్ట్​ చేసుకోవాలి. అయితే ఈ ఫీచర్​ ప్రస్తుతానికి ఐఫోన్​ ఎక్స్​ఎస్ (APPLE IPHONE)​, ఐఫోన్​ ఎక్స్​ఆర్​, ఐఓఎస్​ 15తో వచ్చే ఫోన్​లలో మాత్రమే అందుబాటులో ఉండనుంది.

IOS 15 Features
లైవ్​ టెక్ట్స్​ కాపీ పేస్ట్​

యాప్​ యాక్టివిటీ రికార్డ్​..

యాపిల్​ మొదటి నుంచి కూడా యూజర్​ ప్రైవసీకి పెద్దపీట వేస్తోంది. కొత్తగా వచ్చిన ఈ ఆపరేటింగ్​ సిస్టమ్​లో యాప్​ యాక్టివిటిని మానిటర్​ చేసే వీలు కల్పిస్తోంది. దీంతో యూజర్​కు సంబంధించిన ప్రైవేట్​ డేటా అంటే లొకేషన్​, ఫొటోలు, కెమెరా, మైక్రోఫోన్​ లాంటి ఇతర యాప్​లు దీనితో కనెక్ట్​ అయ్యి ఉంటాయి. ఈ ఫీచర్​ను యాక్టివేట్​ చేసుకోవడానికి ముందుగా ప్రైవసీ ఆప్షన్​ను ఎంచుకోవాలి. అందులో కింద ఉండే రికార్డ్​ యాప్​ యాక్టివిటీని ప్రెస్​ చేస్తే సరిపోతుంది.

IOS 15 Features
యాప్​ యాక్టివిటీ రికార్డ్​..

సఫారీ అడ్రెస్​ బార్​ ప్లేస్​మెంట్​..

ఐఫోన్​ ఐఓఎస్​ 15కు సంబంధించి వచ్చిన మరో ముఖ్యమైన ఫీచర్​ సఫారీ అడ్రస్​ బార్​ ప్లేస్​మెంట్​. ఈ ఫీచర్​తో సఫారీలో అడ్రస్​ బార్​ను ఎక్కడైనా ఉంచుకోవచ్చు. ప్రస్తుతానికి కింద ఉన్న దీనిని పైకి లేక పక్కకు జరుపుకోవచ్చు. ఇందుకోసం ముందుగా సఫారీలో వెళ్లాలి. తరువాత ఏదైనా వెబ్​సైట్​లోకి ఎంటర్ అవ్వాలి. అనంతరం అడ్రస్​ బార్​కు పక్కనున్న ఏఏ బటన్​ పైన క్లిక్​ చేయాలి.

వాయిస్​ మెమోస్​ ప్లేబ్యాక్​..

యాపిల్​లో రికార్డ్​ చేసిన వాయిస్​ మెమోలను కొత్తగా వచ్చిన ఐఓఎస్​ 15 సాయంతో కావాలంటే స్పీడ్​గా కానీ స్లోగా కానీ వినగలుగుతాం. దీంతో సంబంధిత వాయిస్​ మెమోలను అనలైజ్​ చేయవచ్చు. అలాగే వాటి మధ్యలో వచ్చే నిశ్శబ్దాన్ని కూడా కవర్ చేయవచ్చు. ఈ సైలెంట్​ గ్యాప్స్​ను తీసేయడానికి స్కిప్​ సైలెన్స్​ అనే దానిని ఎంచుకోవాలి. సెట్టింగ్​ బటన్​లో కింద ఉన్న దానిని ఎంచుకుంటే నిశ్శబ్దంగా ఉన్న వాటిని తీసేసి కేవలం మాట్లాడిన వాటిని మాత్రమే వినవచ్చు.

ఇదీ చూడండి: షియోమీ నుంచి కొత్తఫోన్​- 20 నిమిషాల్లో బ్యాటరీ ఫుల్​!

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.