రూ.20 వేల లోపు బెస్ట్​ గేమింగ్​ స్మార్ట్​ఫోన్లు ఇవే!

author img

By

Published : Sep 14, 2021, 1:54 PM IST

mobiles

స్మార్ట్​ఫోన్లు అనగానే​ అందరూ ముందుగా ఆలోచించేది కెమెరా, బ్యాటరీ, ధర గురించే. దీంతోపాటు గేమింగ్​కు సపోర్టివ్​గా ఉంటుందా లేదా అని కూడా చూస్తారు. ఇవి వారికి తగ్గట్లుగా ఉంటే వెంటనే కొనడానికి ఆసక్తి చూపిస్తారు. ఈ నేపథ్యంలో రూ. 20 వేలలోపు మంచి గేమింగ్ ఫోన్​ల గురించి తెలుసుకుందాం..

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్​ఫోన్లు సర్వసాధారణం అయ్యాయి. తక్కువ ధరలలో అత్యుత్తమ ఫీచర్లతో పలు కంపెనీలు వీటిని వినియోగదారులకు అందుబాటులోకి తెస్తున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాటరీ బ్యాకప్, కెమెరా పిక్సల్​, ప్రాసెసర్​ వంటి బెస్ట్​ ఫీచర్లతో పాటు బడ్జెట్​ ధరలో లభించే బెస్ట్​ గేమింగ్ స్మార్ట్​ఫోన్లపై ఓ లుక్కేద్దాం..

రూ. 20వేల లోపే..

షియోమీ రెడ్​మీ నోట్ 10 ప్రో మాక్స్

రెడ్​మీ
రెడ్​మీ
  • ధర రూ. 19,999
  • 6.67 అంగుళాల డిస్​ప్లే (ఫుల్​ హెచ్​డీ, హెడీఆర్​-10తో కూడిన సూపర్​ అమోల్డ్​ స్క్రీన్​)
  • 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ
  • 5,020 ఎంఏహెచ్​ బ్యాటరీ కెపాసిటీ (33 వాట్స్​ ఫాస్ట్​ ఛార్జర్​)
  • ఫ్రంట్​ కెమెరా- 16 మెగాపిక్సెల్​
  • బ్యాక్​ కెమెరా- 108 మెగాపిక్సెల్
  • స్నాప్​డ్రాగన్ 732జీ​ ప్రాసెసర్
  • ఆపరేటింగ్ సిస్టమ్​ ఆండ్రాయిడ్ 11

రియల్​మీ ఎక్స్ 7 5జీ

realme
రియల్ మీ
  • ధర- రూ.19,999
  • అత్యాధునిక డిజైన్​తో సరికొత్త ఫీచర్లతో రియల్​మీ కంపెనీ ఈ మొబైల్​ను విపణిలోకి తీసుకొచ్చింది.
  • 6.4 అంగుళాల డిస్​ప్లే (హెచ్​డీ, అమోల్డ్​ స్క్రీన్​)
  • 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ
  • 4,310 ఎంఏహెచ్​ బ్యాటరీ కెపాసిటీ (50 వాట్స్​ ఫాస్ట్​ ఛార్జర్​)​
  • ఫ్రంట్​ కెమెరా- 16 మెగా పిక్సెల్
  • బ్యాక్ కెమెరా- (64+8+2) మెగా పిక్సెల్​
  • మీడియా టెక్​ డైమెన్సిటీ 800యూ ప్రాసెసర్
  • ఆపరేటింగ్ సిస్టమ్​ ఆండ్రాయిడ్​ 10

మోటోరోలా మోటో జీ60

  • ధర- రూ. 17,999
  • 6.8 అంగుళాల డిస్​ప్లే (ఐపీఎస్ ఎల్​సీడీ, హెడీఆర్​-10తో సపోర్ట్​)
  • 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ
  • 6000 ఎంఏహెచ్​ బ్యాటరీ కెపాసిటీ
  • ఫ్రంట్​ కెమెరా- 32 మెగా పిక్సెల్
  • బ్యాక్ కెమెరా- (108+8+2) మెగా పిక్సెల్​
  • స్నాప్​డ్రాగన్ 732జీ ప్రాసెసర్
  • ఆపరేటింగ్ సిస్టమ్​ ఆండ్రాయిడ్​ 11

పోకో ఎక్స్​3ప్రో

poco x3 pro
పోకో ఎక్స్ 3 ప్రో
  • ధర-రూ.18,999
  • 6.67 అంగుళాల డిస్​ప్లే (ఫుల్​ హెచ్​డీ, ఎల్​సీడీ డిస్​ప్లే)
  • 5,160 ఎంఏహెచ్​ బ్యాటరీ కెపాసిటీ (33 వాట్స్​ ఫాస్ట్ ఛార్జర్​)
  • 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ
  • ఫ్రంట్​ కెమెరా- 20 మెగాపిక్సెల్
  • బ్యాక్​ కెమెరా- (48+8+2+2) మెగాపిక్సెల్
  • క్వాల్​కమ్​ స్నాప్​డ్రాగన్​ 860 ప్రాసెసర్​
  • ఆపరేటింగ్ సిస్టమ్​ ఆండ్రాయిడ్ 11

ఇదీ చదవండి:రూ.15వేలలో ఫోన్ కొనాలా? వీటిపై ఓ లుక్కేయండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.