జుట్టు రాలుతోందా? అయితే జామకాయ మిల్క్​షేక్​ ట్రై చేయండి!

author img

By

Published : Oct 20, 2021, 2:42 PM IST

reduce hair fall, milkshake recipe

ప్రస్తుతం ఎంతో మందిని వేధిస్తున్న సమస్య.. హెయిర్ ​లాస్​! దీనికోసం చాలా మంది ఉపయోగించని ఔషధం అంటూ ఏమీ ఉండదు. హెయిర్​ లాస్​ సమస్యకు చెక్​ చెప్పేందుకు ఓ చిన్న మిల్క్ షేక్​ను ట్రై చేస్తే చాలు. అది ఏంటో ఓ సారి చూద్దాం.

సరైన పుడ్​ తీసుకోకపోవడం, నీళ్లు మారడం, కాలుష్యం, హార్మోన్​ ఇంబ్యాలెన్స్​లతో జుట్టు రాలిపోతుంటుంది. దీనికి చెక్​ చెప్పాలని చాలా మంది అనేక రకాలైన వాటిని ట్రై చేస్తూ ఉంటారు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు జామకాయ మిల్క్​ షేక్​ బాగా పనిచేస్తుంది. అయితే దాని తయారీ విధానం ఏంటో ఓసారి చూద్దాం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

జామకాయ మిల్క్​ షేక్​ తయారీ విధానం...

ముందుగా జామకాయలను ముక్కలు ముక్కలుగా కట్​ చేసుకోవాలి. జార్​ తీసుకొని వాల్​నట్స్​, పిస్తా, సోయామిల్క్​ తీసుకొని దానిని మెత్తగా గ్రైండ్​ చేసుకోవాలి. దీనిలో కట్​ చేసి పెట్టుకున్న జామకాయ ముక్కలు, పాలు​ వేసుకొని కలిపి​ గ్రైండ్​ చేసుకోవాలి. మిగిలిన పాలు, పంచదార, ఇలాచీ పొడిని వేసి మరోసారి గ్రైండ్​ చేసి, సర్వింగ్​ గ్లాస్​లోకి తీసుకుంటే జామకాయ మిల్క్​షేక్​ రెడీ.

జామకాయ మిల్క్​షేక్​కు కావాల్సిన పదార్థాలు...

  • జామ కాయ
  • సోయా మిల్క్​
  • పాలు
  • పంచదార
  • పిస్తా
  • వాల్​నట్స్​
  • ఇలాచీ పొడి

ఇదీ చూడండి: వెజ్ కర్రీ పఫ్​.. ఇంట్లో సింపుల్​గా చేసుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.