బియ్యం పురుగు పట్టకుండా ఉండాలంటే?

author img

By

Published : Sep 23, 2021, 4:00 PM IST

Keep bugs away from rice

ఇంట్లో బియ్యం పురుగు పట్టడం సర్వసాధారణం. అలాకాకుండా ఉండాలి అంటే ఏం చేయాలో ఓసారి చూద్దాం. దీనితో పాటు మరిన్ని చిట్కాలు మీకోసం.

బియ్యం పురుగు పట్టడం అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఎప్పుడో ఒకప్పుడు జరుగుతూనే ఉంటుంది. కొద్దిరోజులు వాటిని వాడకుండా ఉంటే వాటిని పురుగులు తినేస్తాయి. ఇలా జరగకుండా ఉండాలి అంటే ఓ చిన్న చిట్కాను ఫాలో అయితే సరిపోతుంది. అదేంటో చూద్దాం.

బియ్యం పురుగు పట్టకుండా ఉండాలి అంటే అందులో నాలుగు ఎండు మిరపకాయలను వేసి ఉంచితే చాలు. ఇలా చేయడం వల్ల ఎన్ని రోజులు అయినా పురుగులు, బియ్యం దరి చేరవు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

మరిన్ని చిట్కాలను చూద్దాం..

  • ఇడ్లీ, దోశల పిండి పులిసి పోకుండా తాజాగా ఉండాలి అంటే పిండిలో ఒకటి లేదా రెండు తమలపాకులు వేసి ఉంచితే తొందరగా పులవకుండా ఉంటుంది.
  • కోడి గుడ్డును ఉడకబెట్టేటప్పుడు నీటిలో ఒక స్పూన్​ వెనిగర్​ వేస్తే.. గుడ్డు పగిలినా కానీ లోపల ఉండే పదార్థం బయటకు రాకుండా ఉంటుంది.
  • పచ్చిమిర్చి ఎక్కువగా తరిగినప్పుడు చేతివేళ్లు మంటగా ఉంటే చల్లటి పాలలో కొద్దిసేపు ఉంచితే మంటలు తగ్గుతాయి.
  • క్యాలీఫ్లవర్​ ఉడికిన తర్వాత కూడా తెల్లగా ఉండాలి అంటే ఉడికేటప్పుడు అందులో రెండు స్పూన్​ల పాలు వేస్తే రంగు మారదు.
  • ఉల్లిపాయ ముక్కలు వేయించేటప్పుడు అందులో పాలు కలిపితే ముక్కలు నల్లగా రాకుండా వేగుతాయి.
  • పచ్చిగా ఉన్న అరటి పండ్లను యాపిల్స్​తో కలిపి ఉంచితే త్వరగా పండుతాయి.
  • బాత్​రూంలో దుర్వాసన వస్తుంటే కొద్దిగా బేకింగ్​ సోడాను ఒక పళ్లెంలో వేసి బాత్​రూంలో పెడితే దుర్వాసన రాకుండా ఉంటుంది.
  • పురుగు లేదా చీడ పట్టిన మొక్కలకు, పొదలకు ఇంగువ కలిపిన నీళ్లు పోస్తే... పురుగు చీడ పోయి మంచి కాపు కాస్తాయి.
  • బెడ్​ రూంలో ఉండే ఓ బల్బ్​ మీద సెంట్​ లేదా పర్ఫ్యూమ్​ చల్లితే.. లైట్​ వేసినప్పుడు ఆ రూం అంతా సువాసనతో నిండిపోతుంది.
  • పట్టువస్త్రాలను కొద్దిగా నిమ్మరసం కలిపిన నీటితో ఉతికితే దుస్తులు రంగుపోకుండా ఉంటాయి.
  • గాజు వస్తువులను వెనిగర్​ కలిపిన నీటితో కడిగితే బాగా శుభ్రపడుతాయి.
  • వాష్​బేసిన్​లో రంధ్రాలు మూసుకుపోయినప్పుడు వేడి నీటిలో కాస్తంత ఉప్పు వేసి కలిపి.. ఆ నీటిని అందులో పోస్తే వాష్​బేసిన్​ శుభ్రంగా తయారువుతుంది.
  • ఫ్రిడ్జ్​లో ఉన్న పన్నీర్​ను బయటకు తీసి వంట చేసే ముందు కొద్దిసేపు వేడి నీటిలో ఉంచితే పన్నీర్​ మృదువుగా తయారవుతుంది.
  • తుప్పు పట్టిన తాళం చెవిని కిరోసిన్​లో ముంచి తుడిస్తే తాళం చెవి తుప్పు పోయి కొత్తదానిలా మారుతుంది.

ఇదీ చూడండి: Chicken recipes: పసందైన చికెన్​ మిరియాల రసం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.