ఈ ఆహార పదార్థాలు గడువు ముగిసినా వాడుకోవచ్చు!

author img

By

Published : Aug 23, 2021, 7:09 AM IST

reuse of expired food

డబ్బు పెట్టి కొన్ని ఆహార పదార్థాలు ఎక్స్​పైరీ డేట్​ అయిపోతే పారేస్తుంటాం. కానీ వాటిని కూడా కొన్ని అవసరాలకు ఉపయోగించొచ్చట. ఇంతకీ అలాంటి పదార్థాలు ఏంటి? ఏయే పనులకు వాడొచ్చు.

వంటింటిలోని కొన్ని పదార్థాలను గడువు ముగిసిందని పారేస్తుంటాం. కానీ కాఫీ గింజలు, బ్రౌన్​ షుగర్​ వంటి పదార్థాలను గడువు తర్వాత కూడా ఉపయోగించుకోవచ్చు. అది ఎలా అంటే?

మయోనీజ్‌

కాస్తంత మయోనీజ్‌ను పాత టూత్‌ బ్రష్‌పై వేసి స్టీలు అరలను రుద్దాలి. కాసేపాగి నీళ్లు స్ప్రే చేసి పొడి వస్త్రంతో తుడవాలి. ఇలా చేస్తే తుప్పుతోపాటు మరకలూ వదిలిపోతాయి. ఇలా రిఫ్రిజిరేటర్‌నూ తుడవొచ్చు.

పెరుగు

దీంట్లోని లాక్టిక్‌ ఆమ్లం చర్మాన్ని మెరిపిస్తుంది. చెంచా చొప్పున పెరుగు, తేనెలను కలిపి ముఖానికి రాసుకోవాలి. పదిహేను నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి.

కాఫీ గింజలు

రెండు చెంచాల చొప్పున కాఫీ గింజల పొడి కలబంద గుజ్జు తీసుకుని బాగా కలపాలి. దీన్ని ముఖానికి పూత వేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. కుండీలో చెంచా కాఫీ గింజలను ఎరువులా వేసి మొక్క నాటితే ఏపుగా పెరుగుతుంది. నీళ్లలో కలిపి మొక్కకు చల్లితే క్రిములు చనిపోతాయి.

బ్రౌన్‌ షుగర్‌

గట్టిగా మారిన బ్రౌన్‌ షుగర్‌ను మిక్సీలో వేసి మెత్తగా చేసి సీసాలో భద్రపరుచుకోవాలి. దీన్ని ముఖానికి, శరీరానికి స్క్రబ్‌లా వాడుకోవచ్చు.

పాలు

కాస్త పుల్లగా మారిన పాలతో బిస్కట్లు, పాన్‌ కేకులను చేసుకోవచ్చు. మరీ పాడైపోయినట్లు అనిపిస్తే మొక్కలకు పోస్తే సరి.

ఇదీ చదవండి : నోరూరించే 'వెదురు బొంగు' కూర.. చేసేయండిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.