అప్పుడు నెహ్రూ.. ఇప్పుడు మోదీ.. పార్లమెంట్​లో పెట్టే 'సెంగోల్' కథేంటో తెలుసా?

author img

By

Published : May 24, 2023, 4:57 PM IST

Updated : May 24, 2023, 8:06 PM IST

sengol sceptre

'సెంగోల్'​ అనే పదం మీలో ఎంత మందికి తెలుసు? దీనిని ఆనాటి బ్రిటీష్​ వలస పాలన ముగింపునకు చిహ్నంగా స్వీకరించామని మీకు తెలుసా? ఎంతో ప్రాముఖ్యం కలిగి సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచే ఈ 'సెంగోల్​' విశేషాలెంటో తెలుసుకుందాం..

Sengol Sceptre History : పార్లమెంట్​లో లోక్​సభ స్పీకర్​ వద్ద పెట్టే ఎంతో ప్రాముఖ్యం గల 'సెంగోల్​' గురించి ఇప్పటికీ భారత ప్రజలకు సరిగ్గా తెలియదన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మే 28న కొత్త పార్లమెంట్​ భవనం ప్రారంభించాక ప్రధాని నరేంద్ర మోదీ.. 'సెంగోల్​'ను లోక్​సభ స్పీకర్​ సీట్ వద్ద పెడుతారని చెబుతూ దాని ప్రాముఖ్యాన్ని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచే ఈ 'సెంగోల్'​ వెనుక ఉన్న అసలు కథెంటో తెలుసుకుందాం.

Sengol 1947 : సెంగోల్​ అనే ఈ రాజదండాన్ని తొలిసారిగా భారత తొలి ప్రధాని జవహర్​ లాల్ నెహ్రూ స్వీకరించారు. బ్రిటీష్​ వలస పాలనకు ముగింపు పలుకుతూ.. భారత స్వయంపాలనకు, అధికార మార్పిడికి గుర్తుగా దీనిని ఏర్పాటు చేశారు. 'సెంగోల్​'.. 'సెమ్మై' అనే తమిళ పదం నుంచి పుట్టింది. దీనికి తమిళంలో ధర్మం అని అర్థం వస్తుంది.

'సెంగోల్'​ ఏర్పాటు వెనుక కథేంటి?
భారతదేశానికి స్వాతంత్య్రం ప్రకటించిన నేపథ్యంలో బ్రిటిష్​ ఇండియా చివరి వైశ్రాయ్​ అయిన లార్డ్​ మౌంట్​ బాటన్​.. తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూతో ఏర్పాట్లపై చర్చించారు. ఈ క్రమంలోనే అధికారికంగా స్వాతంత్ర్యం ఇచ్చినట్లుగా ఏదైనా ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పాటు చేయాలని నెహ్రూకు సూచించారు మౌంట్ బాటన్​. దీనికి స్పందించిన నెహ్రూ.. వెంటనే భారత చిట్టచివరి గవర్నర్​ జనరల్​ సీ రాజగోపాలచారిని అడగగా.. ఆయన ఓ సలహా ఇచ్చారు.

sengol sceptre
సెంగోల్​

చోళ రాజవంశంలో నూతన రాజు సింహాసనాన్ని అధిష్ఠించే సమయంలో జరిగే ఆచారాల గురించి నెహ్రూకు చెప్పారు రాజగోపాలచారి. కొత్తగా రాజు అయ్యే వ్యక్తి పూజారి నుంచి రాజదండాన్ని స్వీకరిస్తారని.. అలానే తాము కూడా బ్రిటిష్​ పాలన నుంచి విముక్తి పొందడానికి సూచికగా ఈ రాజదండాన్ని స్వీకరిద్దామని సూచించారు. దీనికి ప్రధానమంత్రి నెహ్రూతో పాటు మౌంట్​ బాటన్​ కూడా అంగీకరించారు. దీని బాధ్యతను సైతం రాజగోపాలచారికే అప్పగించారు జవహర్​లాల్ నెహ్రూ.

Sengol Parliament : దీంతో ఆ 'సెంగోల్'​ను తయారు చేయించడానికి.. రాజగోపాలచారి వెంటనే నాటి మద్రాసులోని తిరువడుతురయైకి వెళ్లారు. అక్కడే ఉన్న ఓ మఠాన్ని సందర్శించి.. ఈ విషయం చెప్పగా మఠాధిపతులు సైతం దీనికి అంగీకరించారు. ఉమ్మిడి బంగారు చెట్టి అనే ఓ బంగారు ఆభరణాల దుకాణం.. బంగారు 'సెంగోల్​'ను అద్భుతంగా తీర్చిదిద్దింది. ఐదు అడుగుల పొడవుతో 'సెంగోల్'​ పైభాగంలో న్యాయానికి ప్రతీకగా నందిని చెక్కారు. అనంతరం ఈ 'సెంగోల్​'ను పవిత్ర గంగా జలంతో శుద్ధి చేసి లార్డ్ మౌంట్​ బాటన్​కు అందించారు మఠాధిపతులు. ఆ తర్వాత స్వాతంత్ర్యానికి గుర్తింపుగా 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి మౌంట్​ బాటన్ నుంచి సెంగోల్​ను స్వీకరించారు నెహ్రూ. అర్ధరాత్రి స్వాతంత్ర్య ప్రకటన చేయడానికి 15 నిమిషాల ముందు దానిని భారత నూతన ప్రధానికి అందజేశారట. ఆ ప్రక్రియ జరుగుతున్నంతసేపు ప్రత్యేకంగా రూపొందించిన ఒక పాటను ఆలపించారట. ఇదండీ సెంగోల్​ వెనుక ఉన్న అసలు కథ. ప్రస్తుతం ఇది అలహాబాద్‌లోని మ్యూజియంలో ఉంది. ఇప్పుడు దీనిని ఆదివారం కొత్త పార్లమెంట్‌ భవనంలో అమర్చనున్నారు.

Sengol Sceptre History
లోక్​సభ స్పీకర్​ సీట్​ వద్ద ప్రధాని మోదీ (పాత చిత్రం)

'మోదీ దూరదృష్టికి ఉదాహరణ'
నూతన పార్లమెంట్ భవనంలో సెంగోల్​ను పెట్టడం భారత సాంస్కృతిక వారసత్వాన్ని కొత్త తరానికి అందించినట్లు అవుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం ప్రధాని నరేంద్ర మోదీ దూరదృష్టికి ఉదాహరణ అని కొనియాడారు.

"భవన నిర్మాణంలో భాగమైన 7,000 మందిని కార్మికులను ప్రధాని మోదీ సత్కరిస్తారు. మే 28న కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ జాతికి అంకితం చేస్తారు. కొత్త పార్లమెంట్ భవనంలో చారిత్రక రాజదండం 'సెంగోల్'ను ప్రధాని ఉంచుతారు. దీనిని ప్రధాని మోదీ తమిళ ఆదివాసీల నుంచి మే 28న స్వీకరిస్తారు. 1947 ఆగస్టు 14న బ్రిటిష్ వారి నుంచి అధికార మార్పిడి జరిగినప్పుడు అప్పటి ప్రధాని నెహ్రూ సెంగోల్​ను స్వీకరించారు."

-- అమిత్ షా, కేంద్ర హోం మంత్రి

New Parliament Building Inauguration Date : భారత కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ.. మే 28న ప్రారంభించి జాతికి అంకితం ఇవ్వనున్నారు. నూతన పార్లమెంట్ నిర్మాణ పనులు రెండేళ్ల క్రితం ప్రారంభమయ్యాయి. 2020 డిసెంబర్​లోనే భవనానికి శంకుస్థాపన చేశారు ప్రధాని మోదీ. వాస్తవానికి గతేడాది నవంబర్​లోనే భవనం పనులు పూర్తి కావాల్సి ఉంది. కానీ పలు కారణాల వల్ల నిర్మాణం ఆలస్యమైంది.

Sengol Sceptre History
కొత్త పార్లమెంట్ భవనం (పాత చిత్రం)

Parliament New Building : కొత్త పార్లమెంట్ భవనం 64,500 చదరపు మీటర్ల పరిధిలో ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్​తో పాటు రెండు అంతస్తులు ఉంటాయి. ప్రస్తుత భవనాన్ని పోలినట్లు ఉండే కొత్త పార్లమెంట్ ఎత్తు సైతం పాత భవనం అంతే ఉంటుంది. ఒకేసారి 1.224 మంది ఎంపీలు కూర్చోవడానికి వీలుగా పార్లమెంట్ భవనాన్ని నిర్మించారు. లోక్​సభలో 888 మంది, రాజ్యసభలో 384 మంది కూర్చునేందుకు అనుగుణంగా ఏర్పాట్లు ఉండనున్నాయి. ప్రత్యేక రాజ్యాంగ మందిరం, సభాపతులు, మంత్రులకు ప్రత్యేక కార్యాలయాలు ఉంటాయి. ఎంపీల కోసం విశాలమైన లాంజ్, కమిటీల గదులు, లైబ్రరీ, క్యాంటీన్లు ఉండనున్నాయి.

Sengol Sceptre History
పార్లమెంట్ భవనంలో ప్రధాని మోదీ (పాత చిత్రం)
Sengol Sceptre History
కొత్త పార్లమెంట్​ భవనంలో మోదీ (పాత చిత్రం)
Sengol Sceptre History
నూతన పార్లమెంట్ భవనం నమూనా చిత్రం

ఇవీ చదవండి : ఒకే వేదికపైకి విపక్షాలు.. కాంగ్రెస్​తో కలిసి బీజేపీని ఓడిస్తాయా?

కొత్త పార్లమెంటు ఓపెనింగ్​కు కేంద్రం ఆహ్వానం.. వెళ్లరాదని విపక్షాల నిర్ణయం

Last Updated :May 24, 2023, 8:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.