Live : లోటస్పాండ్లో వైఎస్ షర్మిల మీడియా సమావేశం
Published: May 16, 2023, 12:09 PM

Sharmila Live : వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హైదరాబాద్లో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని తాజా పరిస్థితుల గురించి మాట్లాడుతున్నారు. ప్రస్తుత తెలంగాణ రాజకీయ పరిస్థితుల గురించి వివరిస్తున్నారు. అలాగే అకాల వర్షాల కారణంగా రైతులు పడుతున్న గోసను షర్మిల వివరిస్తున్నారు. పంట నష్టం గురించి మాట్లాడుతున్నారు. ఇటీవలే పలు జిల్లాల్లో పర్యటించిన షర్మిల అకాల వర్షంతో నష్టపోయిన రైతుల దగ్గరకి వెళ్లి అక్కడి పరిస్థితుల గురించి.. పంట నష్టం గురించి వివరాలు తెలుసుకున్నారు. వారికి మద్ధతుగా నిలబడి ప్రభుత్వం రైతులకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు.
గత నెల 29వ తారీఖున ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ, డోర్నకల్.. 30వ తేదీన ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వైరా, ఇల్లందు, మధిర.. మే 1వ తేదీన పాలేరులో పర్యటించారు. ఆ జిల్లాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించి, రైతుల బాధలను తెలుసుకున్నారు. వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు అండగా ఉంటామని షర్మిల భరోసా కల్పించారు. అలాగే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ విషయంపై షర్మిల ఈరోజు మాట్లాడనున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలపై ఆమె మాట్లాడనున్నట్లు తెలుస్తోంది.