LIVE : లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ కోసం అఖిలపక్ష ధర్నాలో వైఎస్ షర్మిల
Published: May 22, 2023, 12:39 PM

YS Sharmila at akhila paksham dharna for Lakshmidevipalli Reservoir : రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలని జరుగుతున్న అఖిలపక్ష ధర్నాలో వైఎస్ షర్మిల పాల్గొన్నారు. కేసీఆర్ సర్కార్ రైతులకు ఇచ్చిన హామీలను నేరవేర్చడంలో విఫలమయ్యారని విమర్శించారు. అకాల వర్షాల కారణంగా రైతులు పడుతున్న గోసను షర్మిల వివరిస్తున్నారు. పంట నష్టం గురించి మాట్లాడుతున్నారు. ఇటీవలే పలు జిల్లాల్లో పర్యటించిన షర్మిల అకాల వర్షంతో నష్టపోయిన రైతుల దగ్గరకి వెళ్లి అక్కడి పరిస్థితుల గురించి.. పంట నష్టం గురించి వివరాలు తెలుసుకున్నారు. వారికి మద్ధతుగా నిలబడి ప్రభుత్వం రైతులకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు.
గత నెల 29వ తారీఖున ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ, డోర్నకల్.. 30వ తేదీన ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వైరా, ఇల్లందు, మధిర.. మే 1వ తేదీన పాలేరులో పర్యటించారు. ఆ జిల్లాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించి, రైతుల బాధలను తెలుసుకున్నారు. వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు అండగా ఉంటామని షర్మిల భరోసా కల్పించారు.