LIVE : మహబూబ్‌నగర్-విశాఖ రైలు ప్రారంభోత్సవంలో పాల్గొన్న కిషన్‌రెడ్డి
Published: May 20, 2023, 2:25 PM

Live : మహబూబ్‌నగర్ నుంచి విశాఖ వరకు రైలు ప్రారంభం అయింది. మహబూబ్‌నగర్ రైల్వేస్టేషన్లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి రైలును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు జిల్లాలోని ఓ మీడియా సమావేశంలో మాట్లాడిన కిషన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. పంటల బీమా పథకం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగితే పట్టించుకోవట్లేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఏటా అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నా...కేసీఆర్ రాష్ట్ర రైతులను వదిలేసి రాజకీయ పార్టీలకు నిధులు ఇస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ మినహా అన్ని రాష్ట్రాలు పేదల కోసం లక్షల ఇళ్లు నిర్మిస్తున్నాయని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎరువుల రాయితీ కోసం కేంద్రం లక్ష కోట్లు కేటాయించిందన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి...పెరిగిన ధరల ప్రభావం రైతులపై పడకూడదని రాయితీ పెంచిందన్నారు. ఒక్కో ఎరువుల సంచిపై కేంద్రం 2 వేలకు పైగా రాయితీ ఇస్తోందని కిషన్‌రెడ్డి వెల్లడించారు.