LIVE : శామీర్‌పేటలో బీఆర్ఎస్ గిరిజన ఆత్మీయ సమ్మేళనం- ప్రత్యక్షప్రసారం
tribal people aathmiya sammelanam shameerpet : మేడ్చల్ జిల్లాలోని శామీర్‌పేట్‌లో బీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో.. గిరిజనుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మంత్రులు హరీశ్‌రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎంపీ సీతారాం నాయక్, వివిధ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు ఎన్ని ట్రిక్కులు చేసినా సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. దేశంలోనే రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందించిన ఘనత.. తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. తమ రాష్ట్రాన్ని బాగుచేసుకోలేరు కానీ.. కర్ణాటక నేతలు ఇక్కడి కొచ్చి నీతులు చెబుతున్నారని దుయ్యబట్టారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తీర్చలేక చేతులెత్తెసిందన్నారు. రేవంత్‌రెడ్డి టికెట్లను అమ్ముకుంటున్నారని.. సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. సీఎం కేసీఆర్ చేసిన తొమ్మిదన్నరేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని చూసి.. బీఆర్ఎస్కు ఓటేయ్యాలని ప్రజలకు విజ్ఞుప్తి చేశారు.