LIVE : రాజంపేటలో కాంగ్రెస్ విజయ భేరి సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి- ప్రత్యక్ష ప్రసారం
Revanth Reddy Public Meeting Live : రాష్ట్రంలో ప్రధాన పార్టీల ఎన్నికల ప్రచారం జోరందుకుంది. మేనిఫెస్టోల విడుదల కూడా పూర్తికావడం, అసంతృప్తుల బుజ్జగింపుల తరువాత కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ఉధృతం చేసింది. నిన్న పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే రాష్ట్రంలో పర్యటించి నేతల్లో ఉత్సాహం తీసుకొచ్చారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. ఇవాళ కామారెడ్డి జిల్లా చిన్న మల్లారెడ్డిలో కాంగ్రెస్ విజయ భేరి సభలో పాల్గొన్నారు.
Revanth Reddy Public Meeting Live News : మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఓటర్లకు వివరిస్తూ ఈసారి కాంగ్రెస్ పార్టీకే ఓటెయ్యాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కామారెడ్డి నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్పై పోటీ చేస్తున్న రేవంత్ రెడ్డి.. ఈ నియోజవకవర్గంలో తన సత్తా ఏమిటో చూపించాలని ఉవ్విళ్లూరుతున్నారు. రాబోయే రోజుల్లో పర్యటనలను మరింత ఉధృతం చేసి కాంగ్రెస్ హామీలను గడప గడపకు చేరేలా పార్టీ అగ్రనేతలు ప్రణాళిక సిద్ధం చేశారు.