LIVE : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియా సమావేశం
Published: May 24, 2023, 12:14 PM

Revanth reddy Press meet about GO 111 : జీవో 111 టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ జీవో ఎత్తివేత పై ఎన్జీటికీ వెళ్తామని తెలిపారు. జీవో 111 ఎత్తివేతపై కేసీఆర్ సర్కార్‌పై రేవంత్ విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ.. '2019 జనవరి 1 తర్వాత 111జీవో పరిధిలో కొన్న భూముల వివరాలు బయటపెట్టాలి. 111 జీవో ఎత్తివేత వెనక ఇంటర్నల్ ట్రేడింగ్ జరిగింది. కేసీఆర్ కుటుంబ సభ్యులు 111జీవో పరిధిలో భూములు కొన్నాక జీవో ఎత్తేశారు. కాంగ్రెస్ ,బీజేపీ ,బీఆర్ఎస్ ఏ పార్టీ నేతలు 111జీవో పరిధిలో భూములు కొన్నా..వివరాలు బయటపెట్టాలి.' అని డిమాండ్ చేశారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లను విధ్వంసం చేసే హక్కు కేసీఆర్‌కు ఎవరిచ్చారని నిలదీశారు. దీని వెనక రూ.లక్షల కోట్ల కుంభకోణం దాగుందని విమర్శించారు. మొత్తం భూములు పేదల నుంచి కొనుగులు చేశాక.. ఇప్పుడు జీవో రద్దు చేశారని ఆరోపించారు. బినామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం పటిష్టంగా అమలు చేయాలన్న రేవంత్.. బీఆర్ఎస్ బీజేపీకి ప్రొటెక్షన్ మనీ చేస్తోందని ఆరోపించారు. మరోవైపు ఓఆర్ఆర్ టోల్ టెండర్లపై కూడా రేవంత్ రెడ్డి మాట్లాడారు.