LIVE : గాంధీ భవన్లో రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్
Published: May 22, 2023, 3:08 PM

Revanth reddy Press meet from Gandhi bhavan : కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంతో పార్టీ నేతలలో ఫుల్ జోష్ అందుకుంది. తెలంగాణలో ఎలాగైనా వచ్చే ఎన్నికలలో విజయం సాధించాలని పార్టీ శ్రేణులు కసరత్తు చేస్తున్నారు. పార్టీ చేరికలపై దృష్టి సారించారు. బీఆర్ఎస్, బీజేపీల్లోని అసంతృప్త నేతలను పార్టీలో చేర్చుకునేందుకు తీవ్ర కసరత్తు చేస్తోంది. వచ్చే సాధారణ ఎన్నికలలో పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడనున్నాయి. ఎవరికి వారు బలమైన నాయకులను బరిలోకి దించనున్నారు. అధిక సీట్లతో అధికారాన్ని దక్కించుకోవాలని బీఆర్ఎస్, దక్షిణాధిన ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ, కర్ణాటక ఎన్నికల ఫలితాలను తెలంగాణలో సాధించాలని కాంగ్రెస్ ఇలా ఎవరికి వారే వ్యూహాలు పన్నుతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ చేరికలపై దృష్టి సారించింది. ప్రత్యర్థి పార్టీలను బలహీన పరచాలనే దిశగా పార్టీ ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ అంశాలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతున్నారు.