LIVE : జూబ్లీహిల్స్లో రేవంత్ రెడ్డి రోడ్ షో - ప్రత్యక్షప్రసారం
Revanth Reddy Live : తెలంగాణలో అధికార పగ్గాలు చేపట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తోంది. ఇప్పటికే కొనసాగిస్తున్న ప్రచారాన్ని.. మరింత వేగంవంతం చేసింది. ఏఐసీసీ అగ్రనేతలు తెలంగాణకు వరుస కడుతున్నారు. అధికార బీఆర్ఎస్పై విమర్శలు గుప్పిస్తున్నారు. అభ్యర్థులకు మద్దుతుగా ప్రచారం నిర్వహిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. రాబోయే రోజుల్లో పర్యటనలను మరింత ఉద్ధృతం చేసి కాంగ్రెస్ హామీలను గడప గడపకు చేరేలా పార్టీ అగ్రనేతలు ప్రణాళిక సిద్ధం చేశారు. మరోవైపు పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. మేనిఫెస్టో, కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. బీఆర్ఎస్, కేసీఆర్పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా రేవంత్రెడ్డి వనపర్తిలో నిర్వహించిన కాంగ్రెస్ బహిరంగ సభలో పాల్గొన్నారు. అనంతరం మధ్యాహ్నం నాగర్కర్నూల్లో నిర్వహించిన బహిరంగ సభకు హాజరయ్యారు. ఆ తర్వాత అచ్చంపేట బహిరంగ సభలో పాల్గొన్నారు. అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకున్న రేవంత్ రెడ్డి.. జూబ్లీహిల్స్లో రోడ్ షోలో పాల్గొన్నారు.