LIVE : కోస్గిలో రేవంత్‌రెడ్డి జనసభ- ప్రత్యక్షప్రసారం
Revanth Reddy Live : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారాన్ని కాంగ్రెస్ ముమ్మరం చేసింది. అధికార పగ్గాలు చేపట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తోంది. ఇందులో భాగంగా ఇవాళ్టి నుంచి మూడు రోజులు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఇవాళ తాను పోటీ చేస్తున్న కొడంగల్ నియోజక వర్గంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు నాలుగు కార్నర్ సమావేశాల్లో పాల్గొంటారు. ఈ క్రమంలో మధ్యాహ్నం ఒంటిగంటకు దౌల్తాబాద్‌లో నిర్వహించిన కార్నర్ సమావేశాల్లో రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం రెండు గంటలకు మద్దూర్, 5 గంటలకు గుండుమల్, సాయంత్రం 6 గంటలకు కోస్గి కార్నర్ సమావేశాల్లో పాల్గొంటారు. రేపు 14న స్టేషన్‌ఘన్‌పూర్ , వర్ధన్నపేట ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం కామారెడ్డికి చేరుకొని అక్కడ మండల స్థాయి నాయకులతో ప్రత్యేకంగా సమావేశం అవుతారు. కామారెడ్డిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పోటీ చేస్తున్న రేవంత్‌రెడ్డి విస్తృత ప్రచారానికి కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నెల 15న బోధ్ , నిర్మల్, జనగాం నియోజకవర్గాల్లో రేవంత్‌రెడ్డి ప్రచారం చేస్తారు.