LIVE : మేడ్చల్‌లో కాంగ్రెస్ విజయభేరీ బహిరంగ సభలో రేవంత్‌రెడ్డి - ప్రత్యక్షప్రసారం
Revanth Reddy Live : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారాన్ని కాంగ్రెస్ ముమ్మరం చేసింది. అధికార పగ్గాలు చేపట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తోంది. మరోవైపు తెలంగాణలో ఏఐసీసీ బృందాలు అభ్యర్థులతో సంబంధం లేకుండా.. తెరవెనుక పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేసే పనిని చేపట్టాయి. పోల్ మేనేజ్మెంట్ను బలోపేతం చేసే దిశలో ముందుకు వెళ్తున్నాయి. అభ్యర్థులంతా ప్రచారంలో బిజీగా ఉండగా.. తెరవెనుక జరగాల్సిన కార్యక్రమాలను చక్కబెట్టేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటి వరకు 60కి పైగా నియోజకవర్గాల్లో బూత్ స్థాయి కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడం పూర్తి చేసినట్లు తెలుస్తోంది. మిగిలిన నియోజకవర్గాలకు చెంది శిక్షణ కార్యక్రమాలు వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు వార్ రూమ్ యంత్రాంగం పని చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ ముఖ్యనేతలు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రోజుకు మూడు నియోజకవర్గాల్లో విజయభేరి సభలు నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. నేడు జవహర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ విజయభేరీ బహిరంగ సభలో రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఆ సభ అనంతరం మేడ్చల్ సభలో ప్రసంగిస్తున్నారు.