LIVE : వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రాహుల్ గాంధీ రోడ్ షో - ప్రత్యక్షప్రసారం
Rahul Gandi at Pinapaka Public Meeting Live : ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారానికి ఇవాళ తెలంగాణకు వచ్చారు. భద్రాద్రి కొత్తగుడెం జిల్లా పినపాక, వరంగల్ జిల్లా నర్సంపేట, వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. పినపాకలో రోడ్ షోలో పాల్గొన్న రాహుల్.. అక్కడ నుంచి వరంగల్ జిల్లా నర్సంపేట చేరుకున్నారు. అక్కడ కాంగ్రెస్ నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. అనంతరం నర్సంపేట నుంచి వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చేరుకుంటారు. పార్టీ శ్రేణులతో కలిసి నగరంలో పాదయాత్రలో పాల్గొంటారు. అనంతరం సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 5.15 నిమిషాలకు వరంగల్ పర్యటన ముగించుకుని మామునూరు నుంచి హెలికాప్టర్లో హైదరాబాద్‌కు బయలుదేరుతారు. రాహుల్‌గాంధీకి ఘనస్వాగతం పలికేందుకు నేతలు, కార్యకర్తలు అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా ఇవాళ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల కానుంది. దీంతో రాహుల్ గాంధీ పర్యటనకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే 6 గ్యారంటీలతో ప్రచారంలోకి వెళుతున్న కాంగ్రెస్ నాయకులు.. మేనిఫెస్టోతో మరింత ప్రచారంలో జోరు పెంచనున్నారు.