LIVE : ఆసిఫాబాద్లో ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారం - ప్రత్యక్షప్రసారం
Published: Nov 19, 2023, 12:38 PM

Priyanka Gandhi Live : రాష్ట్రంలో అధికారం చేపట్టడమే లక్ష్యంగా.. కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తోంది. ఇప్పటికే కొనసాగిస్తున్న ప్రచారాన్ని.. హస్తం పార్టీ అగ్రనేతలతో మరింత వేగవంతం చేసింది.బీఆర్ఎస్, బీజేపీ వైఖరిని ఎండగడుతూ.. పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు, మేనిఫెస్టోను జనంలోకి విస్తృతంగా తీసుకెళ్తున్నారు. దీనికి తోడూ ఎన్నికల ప్రచారానికి ఏఐసీసీ అగ్రనేతలు తెలంగాణకు క్యూ కడుతున్నారు. నేడు రాష్ట్రానికి ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ రానున్నారు. ఖానాపూర్, అసిఫాబాద్లో ప్రచారం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా నాందేడ్ నుంచి హెలికాప్టర్లో ఖానాపూర్కు ప్రియాంక గాంధీ చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం అక్కడి నుంచి మధ్యాహ్నాం 12 గంటలకు ఆసిఫాబాద్ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ నాగోబా దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం అక్కడి తండాలోని మహిళలతో కలిసి కాంగ్రెస్ 6 గ్యారెంటీలపై ప్రచారం చేయనున్నారు. తర్వాత మధ్యాహ్నాం 1 గంటకు అసిఫాబాద్ నుంచి ప్రియాంక గాంధీ నాందేడ్ వెళ్లనున్నారు.