LIVE : వనపర్తిలో పొంగులేటి, జూపల్లి ఆత్మగౌరవ సభ
Published: May 14, 2023, 8:18 PM

వనపర్తి జిల్లాలో నిర్వహిస్తున్న ఆత్మ గౌరవ సభలో ఖమ్మం జిల్లా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. వారి ఇరువురు బీఆర్ఎస్పై అసంతృప్తితో ఇటీవల పార్టీ నుంచి బయటకు వచ్చి.. వ్యతిరేక గళాన్ని వినిపించారు. అంతటితో ఆగకుండా వారి వారి నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాల పేరుతో సభలు నిర్వహించి.. బీఆర్ఎస్పై, కేసీఆర్పై నిప్పులు చెరుగుతున్నారు. కేసీఆర్ను గద్దె దించడమే లక్ష్యంగా తమ ప్రయాణం ఉంటుందని జరిగిన ప్రతి సభలో పొంగులేటి, జూపల్లి చెప్పేవారు.
తాము ఎటువైపు ఉంటే ఆ పార్టీదే అధికారం అని ప్రచారం కూడా చేశారు. ఇటీవల బీజేపీ నాయకులు పొంగులేటి ఇంట్లో శ్రీనివాస్ రెడ్డి, జూపల్లితో సమావేశమయ్యారు. వారు ఇరువురుని బీజేపీలో చేర్చుకునేందుకు కసరత్తులు కూడా చేశారు. అందుకు వారు తమకు తగిన సమయం కావాలని బహిరంగంగానే తెలియజేశారు. ఇవాళ వనపర్తిలో ఇరువురు నేతలు ఆత్మ గౌరవ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు ఇరువురు నేతల అభిమానులు భారీగా హాజరయ్యారు.