LIVE : పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీడియా సమావేశం-ప్రత్యక్ష ప్రసారం
PCC President Revanth Reddy Media Conference : ప్రచారానికి గడువు దగ్గర పడుతున్న కొద్దీ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. 3 గంటలే కరెంట్ ఉంటుందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. గతంలో రేవంత్ రెడ్డి అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. దీనికి తోడు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాలు చెబుతోందని.. వారు ఏ ఎన్నికల వాగ్దానాన్ని అమలు చేయడం లేదని జేడీయూ నేత కుమార స్వామి ఇవాళ చేసిన ఆరోపణ కాంగ్రెస్ నేతల్లో కలవరం కలిగించింది. కుమార స్వామి.. కావాలనే తమపై ఇలా బురద జల్లే ఆరోపణలు చేస్తున్నారని.. ఇదంతా కేసీఆర్ కుట్ర అని హస్తం నేతలు భావిస్తున్నారు. ఉదయం తిరుమల వెళ్లిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. హైదరాబాద్లో కుమార స్వామి వ్యాఖ్యలపై స్పందిస్తున్నారు. అలాగే నాగర్ కర్నూల్లోని అచ్చంపేటలో బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజుపై దాడిని కూడా రేవంత్ మాట్లాడుతున్నారు. గువ్వల బాలరాజు చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు.