LIVE : గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీడియా సమావేశం
Published: May 26, 2023, 4:17 PM

గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. ఔటర్ రింగ్ రోడ్ విషయంలో మరోసారి ప్రభుత్వంపై తన మాటల దాడి ప్రారంభించారు. ఇప్పటికే ఆయన పలుమార్లు ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. ఔటర్ రింగ్ రోడ్‌పై టోల్ ట్యాక్స్ విషయంలో ప్రభుత్వం నిబంధనలు మార్చిందని.. ఆయన ఆరోపిస్తున్నారు. రూ. లక్ష కోట్ల విలువైన ఔటర్ రింగ్‌రోడ్డును అమ్మకానికి పెట్టారని రేవంత్ ఆరోపించారు. లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఐఆర్బీ సంస్థకు హెచ్ఎండీఏ ఇచ్చిందని.. ఎప్పుడో బ్యాన్ చేసిన సంస్థకు ఎలా కాంట్రాక్ట్ ఇస్తారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తన వద్ద ఒప్పంద పత్రం కూడా ఉందని ఆయన ప్రకటించారు. ప్రభుత్వం ఇలా నిబంధనలు మార్చి ఐఆర్బీ సంస్థకు కాంట్రాక్ట్ ఇవ్వడం వెనక క్విడ్ ప్రోకో జరిగిందని ఆయన ఆరోపించారు. కాంట్రాక్ట్ దక్కించుకున్న ఐఆర్బీ సంస్థ ప్రభుత్వానికి ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదని ఆయన ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే ఈ డీల్ ను రద్దు చేయాలని ఆయన కోరుతున్నారు.