LIVE : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో ఈటీవీ భారత్ ప్రత్యేక ఇంటర్వ్యూ - ప్రత్యక్షప్రసారం
PCC President Revanth Reddy Exclusive Interview LIVE : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారాన్ని కాంగ్రెస్(Telangana Congress Election Campaign) ముమ్మరం చేసింది. అధికార పగ్గాలు చేపట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తోంది. ఇప్పటికే ఆరు సుత్రాల పథకాలను ప్రకటించిన రేవంత్ రెడ్డి వాటిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సుడిగాలి పర్యటనలు చేపట్టారు. మరోవైపు పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను కూడా కాంగ్రెస్ ప్రచారబరిలోకి తీసుకొచ్చి నాయకులు, కార్యకర్తలు, ఓటర్లలో జోశ్ నింపుతున్నారు. ఎక్కడికక్కడ తనదైన శైలిలో అధికార బీఆర్ఎస్, బీజేపీ నేతలపై విరుచుకుపడే రేవంత్ రెడ్డి.. తన వాగ్దాదితో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. పార్టీలోని సీనియర్లు, జూనియర్లను కలుపుకుపోతూ ప్రచారంలో తాము ముందున్నామని సంకేతాలు ఇస్తున్నారు.
ఇటీవల పార్టీ టికెట్ల కేటాయింపులో చాలామంది తమకు టికెట్ దక్కలేదన్న ఆరోపణలపై ఆయన దృష్టిసారించారు. అసంతృప్తులను బుజ్జగించేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పార్టీలో అంతా రేవంత్ రెడ్డి అనుకున్న విధంగానే జరుగుతోందా.. ప్రచారంలో అందరూ నేతలు కలిసివస్తున్నారా.. పార్టీకి అధికారంలోకి తెచ్చేందుకు రేవంత్ ముందున్న సవాళ్లు.. ఆయన సమాధానాలను ఇప్పుడు చూద్దాం..