LIVE : కూకట్‌పల్లిలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు.. ప్రత్యక్ష ప్రసారం
Published: May 20, 2023, 5:25 PM

NTR Centenary Celebrations : తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కూకట్పల్లి ఖైతలాపూర్ గ్రౌండ్స్‌లో భారీ సభ నిర్వహిస్తున్నారు. సభకు వచ్చే వారి కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సభకు ముఖ్య అతిథిగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ప్రత్యేక అతిథిగా ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు.
వీరితో పాటు పలువురు రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌పై రూపొందించిన 'జై ఎన్టీఆర్' వెబ్ సైట్, ప్రత్యేక సంచికలను ప్రారంభించారు. ఆయనతో పని చేసిన నటీ నటులు, దర్శకులు, సంగీత దర్శకులు, డ్యాన్స్ మాస్టర్లు ఉత్సవాలకు హాజరయ్యారు. ఈ సభలో ఎన్టీఆర్ కుటుంబసభ్యులకు ఘన సన్మానం చేయనున్నట్లు సావనీర్ కమిటీ ఇప్పటికే ప్రకటించింది. అయితే పుట్టిన రోజు కార్యక్రమాలు ఉన్నందున శత జయంతి వేడుకలకు హాజరుకావడం లేదని ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ ప్రకటించారు.