LIVE : గాంధీభవన్ నుంచి ప్రత్యక్ష ప్రసారం
Published: Nov 18, 2023, 12:36 PM

Uttam Kumar Reddy Live : తెలంగాణ కాంగ్రెస్ ఇప్పటి వరకు ఆరు గ్యారంటీలతోనే ప్రచారం నిర్వహిస్తూ వచ్చింది. శుక్రవారం మేనిఫెస్టో విడుదల చేసిన కాంగ్రెస్ ఇకపై బహుముఖ వ్యూహాలతో ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. అన్ని వర్గాలకు, మతాలకు, కులాలకు ప్రయోజనకారిగా ఉండేట్లు మేనిఫెస్టో రూపకల్పన జరిగినట్లు అంచనా వేస్తున్న కాంగ్రెస్ పార్టీ దీనిని జనంలోకి తీసుకెళ్లేందుకు వ్యూహాలకు పదును పెడుతోంది. ఓటర్లను ఆకర్శించి పార్టీకి ఓట్ల శాతాన్ని పెంచేట్లు ఉందని భావిస్తున్న కాంగ్రెస్ ఇది జనంలోకి వెళ్లితే.. ఇప్పుడున్న కంటే మరింత ప్రజాధరణ లభిస్తుందని అంచనా వేస్తోంది. ఆరు గ్యారంటీలే కాంగ్రెస్ పార్టీనీ ఉవ్వెత్తున లేపినట్లు అంచనా వేస్తున్న పీసీసీ.. ఈ మేనిఫెస్టో పార్టీని మరింత జనాదరణకు దోహదం చేస్తుందని ఇతర పార్టీల కంటే తాము ప్రకటించిన మేనిఫెస్టో అంశాలకు ఎక్కువ ఆకర్శితులవుతారని భావిస్తోంది. 37 అంశాలతో 42 పేజీల్లో ప్రకటించిన భారీ మేనిఫెస్టో.. ఉద్యోగ, నిరుద్యోగ వర్గాలతోపాటు అన్ని సామాజిక వర్గాలపై కాంగ్రెస్ వరాల జల్లు కురిపించింది. తాజాగా హైదరాబాద్ గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డితో పాటు విజయశాంతి పాల్గొన్నారు.