LIVE : జగిత్యాలలో ఎమ్మెల్సీ కవిత ఎన్నికల ప్రచారం - ప్రత్యక్షప్రసారం
MLC Kavitha LIVE : తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గరకు వస్తున్న క్రమంలో రాజకీయ పార్టీలన్ని ప్రచారంలో మునిగిపోయాయి. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకోవడానికి పలు వ్యూహాలను రచిస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. మరోవైపు సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలతో.. రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అలానే మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు ప్రచారంలో భాగంలో రోడ్‌షోలతో పలు జిల్లాలో చుట్టేస్తూ హోరెత్తిస్తున్నారు. కేసీఆర్‌ను హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా చేయడమే తమ లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. అదేవిధంగా ప్రచారం, పోల్ మేనేజ్మెంట్, చేరికలు సహా గెలుపును ప్రభావితం చేసే ఏ ఒక్క అంశాన్ని వదిలి పెట్టడం లేదు. ఇతర పార్టీల్లో ఎవరైనా అంసతృప్తితో ఉన్నారని తెలిస్తే.. బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీశ్‌రావు.. ఆ నేతల ఇళ్లలో వాలిపోతున్నారు. చర్చలు జరిపి గులాబీ కండువా కప్పుతున్నారు. తాజాగా జగిత్యాల జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పర్యటిస్తున్నారు. పలు నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు.