LIVE : కోరుట్ల నియోజకవర్గంలో ఎమ్మెల్సీ కవిత ఎన్నికల ప్రచారం - ప్రత్యక్షప్రసారం
Published: Nov 16, 2023, 12:27 PM

MLC Kavitha LIVE : తెలంగాణలో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యాయి. బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్సీ కవిత విసృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి ముందే ప్రచారాన్ని షురూ చేసిన గులాబీ దళం.. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ముఖ్యంగా గులాబీ బాస్ కాస్త ముందుగానే రంగంలోకి దిగి ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
ఓవైపు సీఎం కేసీఆర్.. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. ఇంకోవైపు మంత్రి హరీశ్ రావులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ముగ్గురు ముఖ్య నేతలతో రాష్ట్రంలో గులాబీ పార్టీ ప్రచారం హోరెత్తుతోంది. వీరికి తోడు ఎమ్మెల్సీ కవిత సైతం పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ.. పార్టీ అభ్యర్థులకు మద్దతు కూడగడుతున్నారు. బహిరంగ సభలు, రోడ్ షోలలో పాల్గొంటూ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలంటూ ఓటర్లను కోరుతున్నారు. ఈ క్రమంలోనే నేడు జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.