LIVE : మంత్రి వర్గ సమావేశ నిర్ణయాలను వెల్లడిస్తున్న మంత్రులు హరీశ్‌రావు, గంగుల
Published: May 18, 2023, 7:06 PM

సీఎం కేసీఆర్ అధ్యక్షతన నూతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. దాదాపు మూడు గంటలపాటు సాగిన సమావేశం జరిగింది. మంత్రి వర్గంలో తీసుకున్న నిర్ణయాలను మరికాసేపట్లో మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్ వెల్లడించనున్నారు. కొత్త సచివాలయం నిర్మించిన తర్వాత జరుగుతున్న.. తొలి భేటీగా ఈ సమావేశం నిలువనుంది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కొన్ని ముఖ్యమైన విషయాలపై చర్చించే అవకాశం ఉంది. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలపై ప్రధానంగా చర్చించనున్నారు.
పోడు పట్టాలు, గృహలక్ష్మి, ఇళ్ల పట్టాల పంపిణీ, ఇతర అంశాలపై కూడా చర్చ జరగనుంది. ఈ ఏడాది చివరన జరిగే రాష్ట్ర శాసనసభ ఎన్నికల సన్నాహక ప్రణాళికపై కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. గతంలో తీసుకున్న నిర్ణయాలకు మంత్రివర్గ సమావేశంలో ఆమోద ముద్ర వేయనున్నారు. అలాగే గవర్నర్ తిరస్కరించిన బిల్లులపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే జూన్2 నుంచి 21 రోజుల పాటు రాష్ట్రాభివృద్ధి దశాబ్ది ఉత్సవాలను నిర్వహించనున్నారు.